Tuesday, December 14, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారు మా ఇంటి దైవం రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు. 💐💐💐🤝🙏
శనివారం --: 11-12-2021 :-- ఈరోజు AVBమంచి మాట ...లు

మనిషి గొప్ప తనం నమ్మడంలోనూ నమ్మించడంలో ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది మనం నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ ! అబద్దం చేప్పి మోసం చేయకూడదు .

నువ్వు ఎవరి కోసం అయితే బతుకుతున్నావో వారికోసం కొన్నింటిని వదులుకో తప్పు లేదు కానీ ఎవరైతే నీ కోసమే బ్రతుకుతున్నారో వారిని మాత్రం ఎవరి కోసమో వదులుకోవద్దు .

ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు .మీరు తప్పక ప్రయత్నించండి సంతోషంగా ఉండండి
కష్టాలు మీకే కాదు ప్రతి ఒక్కరికి ఉన్నాయి శ్రీరాముడి అంతటి వారికే తప్పలేదు.. భూమి గుండ్రంగా ఉంది ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి సహనం వహించండి చాలు కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది

మీ .ఆత్మీయ బంధువు .AVB సుబ్బారావు 💐🤝🙏

సేకరణ

No comments:

Post a Comment