మనిషి హృదయం
🕉️🌞🌎🏵️🌼🚩
చెట్టును చెట్టుగానే చూస్తాడు. చెట్టులో ఏమీ అందం కనిపించదు. పుట్టను మట్టిగా చూస్తాడు. పుట్టలో చీమలు ఉన్నాయా, పాముందా అనేవి అతడికి అనవసరం. మంద్ర స్థాయిలో వీచినా, తీవ్రంగా వీచినా... గాలి గాలే. అందులో ప్రాణవాయువు ఉంటుంది. మనం బతుకుతున్నాం. అది కలుషితం కావడం వల్ల రోగాల పాలవుతున్నాం.
మనిషి గలగల పారే నదిని చూస్తాడు. అందులో నాచు, క్రిమి, కీటకాలు ఉంటాయి. ఆ నీళ్లు నేరుగా వాడకూడదు అంటాడు. సూర్యుడు వస్తాడు. వెళతాడు. అది ఆయన పని. చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి బతుకుతాడు. స్వయం ప్రకాశం లేదు. గ్రహాలంటారా? అవి సౌర వ్యవస్థలో ఒక భాగం. అలా తిరుగుతూనే ఉంటాయి. పని లేనివాళ్లు తిరుగుతున్నట్లు... ఇదీ వరస. ఇలా ఉంటాయి ఆ వ్యక్తి ఆలోచనలు... ప్రకృతిలో కలిసి బతుకుతాడు. ప్రకృతితో ఏం సంబంధం లేనట్లే ఉంటాడు. ప్రకృతిని ఒక యాంత్రిక వ్యవస్థగా చూస్తాడు.
సంఘంలో అందరితో కలిసి ఉన్నట్లు కనిపిస్తాడు. కాని అన్నీ వ్యావహారిక వ్యాపార సంబంధాలే నెరపుతుంటాడు. డబ్బు లేకపోతే గౌరవం ఎక్కడ ఉంది? అసలు గౌరవం ఎక్కడ ఉంది? అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలే కదా. కనుక వ్యాపారం లేకపోతే బతుకే లేదంటాడు.
భావాలు, స్పందనలు, సౌందర్య ఆరాధన, లాలిత్యం, సౌకుమార్యం, జీవనం మీద నమ్మకం... అతడిలో మచ్చుకైనా కానరావు.
పుట్టాం. బతుకుతున్నాం. చావాలి. దానికోసం ఎదురు చూడాలి. అంతా భౌతికమే. కనిపిస్తున్నవాడే మనల్ని రక్షించడం లేదు. కనపడనివాడు ఏం రక్షిస్తాడు? అదంతా పెద్ద భ్రమ. మాయ. కొంత మంది మనుషులు కూడగట్టుకొని చేస్తున్న గారడి అని తలపోస్తాడు.
ఇలాంటి భావాలతో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లనెవరూ కాదనలేరు. వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది.
మనిషి మనిషిలా ఉండాలి. సహజ మానవ స్పందనలను నిగ్రహించుకుని హృదయాన్ని కోల్పోకూడదు. హృదయం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే విశ్వ సౌందర్యం తెలియదు. ఈ జగత్తును ఇంత అద్భుతంగా సృష్టించడం వెనక విధాత ఉద్దేశాన్ని ఎప్పటికీ గ్రహించలేం.
ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం సృష్టి సూత్రం. అంతా ఒక గొప్ప సంగీత వాయిద్యం మీద పలికించే దివ్య రాగాల ఝరి.
నిమిత్తమాత్రంగా ఉండటం మంచిదే. అది జ్ఞానోదయమై సత్య రహస్యం తెలుసుకున్నప్పుడు ఏర్పడిన దివ్య వైరాగ్య స్థితి. అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుని హృదయానికి, మనసుకు ఉన్న లంకెను తెంచుకుని తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతున్నానని చెప్పుకోవడం సరి కాదు.
సత్యం శివం సుందరం ఏమిటో బోధపడాలంటే మనసులోని యాంత్రికతను తొలగించుకుని, తర్క వితర్కాలతో కూడిన మనసును జీవన తత్వంలో ఉన్న ప్రేమతో అనుసంధానం చేసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం మధ్యలో సత్యం నివసిస్తుంది. గొప్ప ఆలోచనలు దాన్ని చూపిస్తాయి.
మనిషి మట్టి మనిషే. అతడి హృదయం మాత్రం మట్టి కాదు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడాలంటే లోపలికి చూడటం ఒక్కటే మార్గం. అక్కడ మట్టి మీద మొలిచిన మహా సౌందర్యలోకాలు ఎన్నో ఉన్నాయని అంతస్సౌందర్య వీక్షకులైన జ్ఞానులు చెబుతారు!*
- ఆనందసాయి స్వామి
🕉️🌞🌎🏵️🌼🚩
సేకరణ

No comments:
Post a Comment