🍁భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది🍁
📚✍️ మురళీ మోహన్
👳 భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి...?
👼 భగవంతుడు : ఏం జరిగింది...? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ...?
👳 భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని... తొందరగా నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను... అది మ్రోగలేదు... దాంతో నేను లేటుగా లేచాను.
👼 భగవంతుడు : అంతేనా...?
👳 భక్తుడు : ఇంకా ఉంది. ఈ రోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది. దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.
👼 భగవంతుడు : అంతేగా...?
👳 భక్తుడు : అప్పుడేనా...? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.
👼 భగవంతుడు : సరే..ఇంకా...?
👳 భక్తుడు : పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..స్నేహితుడితో మాట్లాడుతున్న ఫోను సడన్ గా కట్ అవడం...మళ్ళీ చేసేలోపు..బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం...ఏంటివన్నీ...?
👼 భగవంతుడు : అయిపోయాయా...?
👳 భక్తుడు : అసలైంది ఇప్పుడే స్వామీ...! చాలా అలసిపోయి, ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే, సరిగ్గా అప్పుడే ఫ్యాను, ఏ.సి. రెండూ ఒక్కసారే పని చేయకపోవడం... ఎందుకు స్వామీ.. నా మీద ఇంత కక్ష నీకు...?
👼 భగవంతుడు : సరే..! నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను..!
📣 ఇవాళ ప్రొద్దున్న అలార్మ్ మ్రోగితే నువ్వు వెంటనే స్నానానికని బాత్రూమ్ కు వెళ్ళేవాడివి. కానీ..ఆ సమయంలో అక్కడ ఒక నల్ల త్రాచు పడగవిప్పి సిద్ధంగా ఉంది. అందుకే అది వెళ్ళిపోయాక నువ్వు మేల్కోవాలని, అలార్మ్ మ్రోగనివ్వలేదు.
🚐 కారు మొరాయించకుండా ముందే బయల్దేరి వుంటే ఒక త్రాగుబోతు నడుపుతున్న ట్రక్కు వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగేది.
🍔 ఇక భోజనమంటావా...నువ్వెళ్ళిన సమయంలోనే అక్కడి వంటవారు సాంబారులో ఒక బల్లిని గమనించారు...దాంతో ఆ మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, మళ్ళీ సాంబారు కాచి వడ్డించడం వల్ల లేటయ్యింది.
📲 కారులో నీతో ఫోను మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు. ఆ కుట్రలో భాగమే ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు.
🔌 చివరిగా...ఫ్యాను, ఏ.సి. అంటావా... అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యుట్ జరిగి.. ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది. అవసరమంటావా...చెప్పు ?
👳భక్తుడు : స్వామీ...నా అజ్ఞానాన్ని మన్నించు. నన్ను కాపాడడానికే ఇవన్నీ చేసావని అర్ధం చేసుకోలేక నిన్ను నిందించాను. క్షమించు స్వామీ..!
👼 భగవంతుడు : క్షమాపణ అడగడం కాదు... నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో..! ఏం జరిగినా... మన మంచికే అనుకోవాలి. మీ దగ్గర ప్రణాళికలెన్ని ఉన్నా.., మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళిక నేనెప్పుడో సిద్ధం చేసి ఉంచాను.🤘
సేకరణ

No comments:
Post a Comment