Tuesday, December 14, 2021

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు మరియు గీతా జయంతి శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు, తిరుత్తని శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. విశ్వ గురువు కృష్ణ భగవానుని చే చెప్పబడిన గీతా సారాన్ని గ్రహించండి.. ఆచరించండి గీతా పట్టుకో రాత మార్చుకో..

మంగళవారం --: 14-12-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు

జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి బాధ నుంచి సంతోషం అయిన ఓటమి నుంచి గెలుపు అయిన ఆవరోధాలు నిన్ను ఆపలేవు కష్టాలు బాధలు నిన్ను ఆపలేవు నీ గమ్యం చేరుకోడానికి నిన్ను ఆపగలిగే వారు ఒక్కరే ఆది నువ్వే ఆగకు మిత్రమా నీ గమ్యం చేరేవరకు నీకు విజయం చేకురేవరకు .

మనిషిది చాలా విచిత్రమైన స్వభావం కలిగినవాడు ఇసుకలో సౌదం చూస్తాడు రాయిలో శిల్పం చూస్తాడు లోహంలో ఆభరణం చూస్తాడు ఆకులో ఔషదం చూస్తాడు అద్దం లో అందం చూస్తాడు వ్యసనంలో ఆనందం చూస్తాడు కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో ! .

ఎవరి గురించి వారే తెలుసుకోవాలి విత్తనంలో మహా వృక్షం దాగి వున్నట్లు ప్రతివారిలోనూ అపరిమిత శక్తులు దాగి ఉంటాయి వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకో వచ్చు మనకి ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు ఆ ఉన్నదానిలో మనం ఎంత సుఖంగా ఉన్నాము అనేదే ముఖ్యం .

పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరూ బాగుచేయలేరు

సేకరణ ✒️మీ ... ఆత్మీయుడు. AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment