Tuesday, December 14, 2021

భాగవతంలోని "పన్నీటి జల్లులు"

"🚩🚩🚩🚩🚩🚩
" భాగవతంలోని "పన్నీటి జల్లులు"

🙏🏽"సమర్పణ" : "మజుందార్, బెంగుళూర్,"

👍" పెద్దల మాటలను శిరసా వహించుట యే- పిల్లల కర్తవ్యము, శివుడు అంతటి వాడు కూడా తన కంటే పెద్దవాడైన బ్రహ్మ చెప్పినట్లు- అన్నిటినీ ఒప్పుకున్నాడు.

🦚" పరమాత్మ అనుగ్రహం ఉంటే, చిన్ని స్థానమును కోల్పోయినను, గొప్ప స్థానము దొరుకుతుంది.
(పరమాత్మ- ధ్రువ రాజుకు గొప్ప స్థానం ఇచ్చుటకే- అతనికి తండ్రి తొడపైన స్థానము దొరక లేదేమో!)

🌷" ఇతరులు చేయు తప్పులకు, పరమాత్మయే వారికి సరైన ఫలమును ఇస్తాడు.

🌷" ఇతరులు చేయు తప్పులకు వారు కష్టపడాలని , దుఃఖ పడాలని మనము కోరుకుంటే, ఆ ఆపాపము నందు మనము భాగస్వాములమై, ఆ పాపము మనకు వస్తుంది.

🌷" ప్రతి తల్లియు దేవుని పట్ల పాటించవలసిన విశ్వాసము, పిల్లలను ఆత్మవిశ్వాసంతో పెంచవలెను, ( ధ్రువుని యొక్క తల్లి :సునీతి,
చిన్నవయసు నుండి దేవుని ధ్యానము ను చేయిస్తూ, విష్ణు భక్తిని నేర్పినది. శ్రద్ధ భక్తిని కలిగించినది పరమాత్మ నామ స్మరణ చేయు ప్రవృత్తిని పెంపొందింప చేసినది తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినా, పరమాత్మ రక్షిస్తాడు, అన్న " పరిపూర్ణ విశ్వాసము" కలదు. )

🌷" ఎవరికి విహితమైన కార్యము వారే చేయవలెనన్న పరమాత్మ సంకల్పం: లోక పాలకులైన ఇంద్రాది దేవతలు ధ్రువుని కంటే ఎంతో ఉత్తములు, వారికి
అలాంటి గొప్ప తపస్సు చేయుటకు శక్తి లేదని కాదు. ధ్రువుని కి ఒక ఉత్తమ స్థానము ఇచ్చుట.
సంకల్పము, ఒకరిని ప్రశంసించుట కై అంతకంటే ఉత్తములను తగ్గించి చూపరాదు. తగ్గినా కూడా అది తాత్కాలికమే, అని అర్థము చేసుకొని భావించవలెను.

🙏🏽" మన యందు "పరమాత్ముడు" ఉంది మన చేత సత్కర్మలను చేయించును. పరమాత్మ అనుగ్రహము లేకుండా అతని జ్ఞానము కూడా మనము చేయలేము.
( గమనిక: నేను స్వతహాగా స్తోత్రమును చేయగల శక్తి ఉన్న వాడిని కాను, మీరే నాలో వుండి నా చేత సోత్రము చేయించి, నా పై అనుగ్రహము చేస్తున్నావు. అన్ని ఇంద్రియముల లందు నీవే ఉండి, సత్ కార్యములను చేయిస్తున్నావు. వాక్కు, జ్ఞాన కార్య /కర్మలు/అన్ని ఇంద్రియముల నందు పరమాత్మ డు ఉండి చేయిస్తున్నాడు. అనే స్పృహ కలిగి ఉండవలెను.)
" హరిసర్వోత్తమ"
" వాయుజీవోత్త మ"
🚩🚩🚩🚩🚩🚩🚩

సేకరణ

No comments:

Post a Comment