Friday, March 11, 2022

మంచి మాట..లు

దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయం శుభాకాంక్షలు లక్ష్మీ గాయత్రీ దుర్గా సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ💐💐💐🌹🕉️

11-03-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
ఎండాకాలం మొదలైంది పశుపక్ష్యాదులు దాహం తీర్చుటం కోసం ఏమి ఖర్చు కాని కొద్దిగా నీళ్ల ను పెడదాము.. అవకాశం ఉంటే ఏదైనా గింజలు పెడదాము.. చిన్న జీవులను బతకానిద్దాం

సమాజం విచ్చిన్నం కావటానికి కారణం చెడ్డ వారు చేసే పనులేకాదు... మంచివారు ఏమి చేయకుండా ఉండటం కూడా కారణం

మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకి ఎక్కడిది

వంద పేజీలున్న పుస్తకం లోనే తప్పులున్నప్పుడు వంద సంవత్సరాల జీవితం లో తప్పులు లేకుండా ఎలావుంటాయి..చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని చదువుకోవాలి.. జీవితంలో తెలిసి తెలియక జరిగే తప్పులను కూడా సరిదిద్దుకోవాలి.. సరిదిద్దుకుంటూ జీవించాలి అది పుస్తకం అయినా జీవితం అయినా

మన కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వితే నవ్వని పరవాలేదు.. కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి మనం నవ్వకూడదు..కష్టాన్ని అర్థం చేసుకుందాం

మనకు వంద కోట్లు ఉన్నంతమాత్రాన మనం వందేళ్లు బతుకుతామని గ్యారెంటీ లేదు..
అలానే మనకు పది ఇల్లు ఉన్నత మాత్రాన పది ఇళ్లలో ఒకేసారి ఉండలేము ఒక్కదానిలో మాత్రమే ఉండగలం. ఉన్నది ఒకే జన్మ.. అనుకుని పది జన్మలకు సరిపడా మంచినిచేద్దాం.. మరలా చేసే అవకాశం ఉంటుందో ఉండదో
సేకరణ మీ ఆత్మీయ బంధువు ✒️ AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment