Sunday, March 13, 2022

జ్ఞానానికి , అజ్ఞానానికి,నూలు పొగంతే తేడా..

🍃🥀జ్ఞానానికి , అజ్ఞానానికి,నూలు పొగంతే తేడా..ఇట్లా నాకే ఎందుకయితుందని ఏడిస్తే అజ్ఞానము,ఇది నాకేదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచిస్తే జ్ఞానం..

తెలిసిపోయిందనుకుంటే అజ్ఞానమ,తెలుసుకోవాలని తెలిస్తే జ్ఞానం..అందరినీ ప్రేమించు కానీ,కొద్ది మందినే నమ్ము..ప్రతీదీ సత్యమే..
కానీ,ప్రతి ఒక్కరూ పవిత్రమైనవాళ్ళు కారు..

ఇతరుల ముందు మంచివాడు గానో,తెలివైన వాడిలాగానో,నటించడం సులభం..నీ కంటికి కూడా,నీవు అలాగే కనిపిస్తుంటే,
నీవు వెధవాతి వెధవవని అర్థం..

మన చేతకానితనాన్ని,వేరేవాడి కుతంత్రంగా చూస్తున్నంత కాలం,మన పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశమే వుండదు..

No comments:

Post a Comment