Wednesday, March 16, 2022

అక్షర సత్యాలు

🙏అక్షర సత్యాలు🙏

💞ఫలితం లేదని ప్రయత్నం మధ్యలో ఆపేస్తే విజయానికి నువ్వు పూర్తిగా దూరం ఐపోతావ్ .నమ్మకం అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకుంటే విజయం నీ ఇంటి బయట నీకోసం కాపలా కాస్తుంది..!!

💞సాధనే లక్ష్యం సత్యమే జీవితం ఐనపుడే నిరంతరం ఆనందం ఉంటుంది..!!

💞మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినపుడు ,దానిని పూజిస్తాము. అపుడు మట్టిని చూడము. మన ఇష్ట దైవాన్నే చూస్తాము. అలాగే ప్రతి మనిషి లో మంచిని మాత్రమే చూడగలిగితే అంతా మంచే జరుగుతుంది..!!

💞కోపం అనేది ఒక చేతకాని తనం. మనం ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నపుడు ఈజీగా వచ్చే ఒక వెపన్ . ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు..!!

💞ప్రపంచం లోని అన్ని హృదయాలను " స్నేహం "అనే బంగారు తీగతో కట్టి పడవేయ వచ్చు..!!

💞ప్రేమ,మరియు కృతజ్ఞతలు ఎటువంటి జబ్బులనైనా కరగించి వేయగలవు..!!

💞సృష్టి లోని అనంతమైన సంపదలను, మన ఆలోచనల ద్వారా, మన భావాలద్వారా అపరిమితంగా మన జీవితానుభవం లోనికి తెచ్చుకొన వచ్చును..!!

💞మనం పదే పదే ఒక విషయం గురించి ఆలోచనలు చేసి ఈ సృష్టికి తెలియజేస్తుంటే తప్ప ఏ అనుభవము మనజీవితం లోనికి ప్రవేశించదు..!!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment