Sunday, March 13, 2022

మంచి మాట..లు

సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥

ఆత్మీయ బంధు మిత్రులకు ఆదివారపుశుభోదయం శుభాకాంక్షలు💐 ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
13-03-2022:- ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట..లు
పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపు మర్చిపో
నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో
ఆనందం అయిన వాళ్ళతో పంచుకో
కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లును ఓర్చుకో
చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో
గతం చేసిన గాయాలను మర్చిపో ముందున్న గమ్యాన్ని చేరుకో
మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో

స్వశక్తి మీద ఆధార పడిన వ్యక్తి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు.. తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి.. అదృష్టం సరదాగా నమ్ముకో.. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే

సహనం మంచి వారి దగ్గర ఉంటుంది.. కోపం చెడ్డ వారి దగ్గర ఉంటుంది
ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది.. జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది

మనం మాట్లాడే విధానం ఇట్లా ఉంటే గౌరవం ఉంటుంది
ప్రేమతో మాట్లాడు..ఆలోచించి మాట్లాడు... అర్థం చేసుకుని మాట్లాడు మంచి మాట్లాడు.. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు..నవ్వుతూ మాట్లాడు.. మనసు విప్పి మాట్లాడు.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు.. తెలివిగా మాట్లాడు.. మనసు- నొప్పించకుండా మాట్లాడు... తక్కువ* మాట్లాడు
సేకరణ ✒️AVB సుబ్బారావు 🌹🤝👍

సేకరణ

No comments:

Post a Comment