మీ మతం వాళ్ళు .... కనిపించే ప్రతి రాయికి మొక్కుతారు మీరు .... అన్నాడొక మిత్రుడు నన్ను వెటకారంగా ....
రాయికే కాదు .... కొండలకి ,గుట్టలకి చెట్లకి,పిట్టలకి, జంతువులకి కూడా మొక్కుతాం ... ఆ మాటకొస్తే సూర్యుడికి చంద్రుడికి కంటికి కనిపించని గ్రహాలకి రాత్రిళ్ళు కనిపించే నక్షత్రాలకి .... మనకందరికీ ఆశ్రయమిచ్చిన భూమికి,అన్నం పెట్టే వరి కంకికి పాలిచ్చే గోమాతలకి ఆరుగాలం కష్టించే బసవన్నలకి కూడా దణ్ణం పెట్టుకుంటాం ....
కణం గా మొదలైన మన జీవన పయనాన్ని అగ్ని కణాల్లో కాలి బూడిదయ్యి గాలిలో కలిసేదాకా మనకు సాయం చేసే ప్రకృతిలోని అణువణువుకు దణ్ణం పెట్టుకుంటాం ....అంతెందుకు మాకు కనిపించి సాయం చేసిన వాళ్ళకే కాదు ... కనిపించకుండా సాయం చేసిన వాళ్ళని కూడా ముక్కోటి దేవతలుగా కీర్తించి పూజిస్తాం .... దర్గాలకు చర్చిలకు గురుద్వార్ లకు కూడా వెళ్లి ఆరాధిస్తాం .....
మీరంతా అనుకున్నట్టు మాది మతం కాదు ....ఈ దేశంలో మన పెద్దలు ప్రకృతి పట్ల సాటి మనుషుల పట్ల ఆరాధనను ప్రేమను చూపించటానికి,చెడు జోలికి వెళితే ఎప్పటికైనా కీడు జరుగుతాదని చెప్పటానికి ... ఎంచుకున్న జీవన మార్గం .... ఆ మార్గాన్ని అనుసరించి పయనించే వారంతా మా మతం వారే .... వారు ఈ భూమ్మీద ఎక్కడ నివసించినా ..... ఏ భాష మాట్లాడినా .... ఏ వేషధారణలో ఉన్నా ....అన్నాను స్థిరంగా ....
నా పెద్దలు నాకు ఇచ్చిన ఈ మార్గం గురించి ... ఎంతో కొంత చెప్పేలా ప్రేరేపించిన .... ఆ మిత్రుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను ...
కొంపతీసి అతనిలో ఉన్న దేవుడే .... నాచేత అన్ని మాటలు మాటాడించాడేమోనన్న అనుమానించాను ఆ రోజంతా ....
---సేకరణ
No comments:
Post a Comment