Monday, March 7, 2022

ఆచార్య సద్బోధన

🤘ఆచార్య సద్బోధన:

గాలి కనిపించనంత మాత్రాన ఊపిరి పీల్చడం మానేయడం లేదు కదా!

అలానే దేవుడు కనిపించనంత మాత్రానా నమ్మడం మానేయకూడదు.

బ్రతకాలంటే గాలి పీల్చాలి తప్పదు.

ఆనందమును అనుభవించాలంటే దేవుని నమ్మి తీరాలి.

నిజానికి దేవుడు కనపడాలి అని కోరుకునే కంటే దైవత్వాన్ని అనుభవించాలి అని కోరుకోవడం ఉత్తమం.

కలియుగంలో ఇది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి!

ఐనా దైవత్వాన్ని అనుభవించకుండా దేవుని చూసి ఏమి చేస్తారు?! నిజ తత్వాన్ని అనుభవించనివారు నిజ రూపాన్ని దర్శించి ఏమి చేస్తారు?

కనుక నిజ భక్తులు ఎల్లపుడూ దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.

ఆ పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఉన్నపుడు, మన భక్తిలో విశ్వాసంలో నిజం ఉన్నదని ఆయన అనుకున్నపుడు ఆయనే ఏదో రీతిగా దర్శనం ఇస్తాడు.

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment