Tuesday, May 3, 2022

ఆణిముత్యాలు.

ఆణిముత్యాలు.
🌹ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి.
🌹 సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నారా అని అడగండి.
🌹 పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి.
🌹 పోయాక ప్రేమాభిమానాలు కాకుండా జీవించి ఉన్నప్పుడే నేనున్నాను అని భరోసా ఇవ్వండి
🌹అప్పుడే స్నేహ బంధం నిలుస్తుంది.
🌹 అర్థం లేని వాగుడు కన్నా అర్థవంతమైన మౌనం మిన్న.
🌹 ఆచరణలో పెట్టని ఆలోచనలు అర్థం లేనివి.
🌹 ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అర్థవంతమైనవి .

🌹 సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి.
🌹 కానీ వాటి సరైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుంది .
🌹 లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం.
🌹 ఒక్కటి అడిగితే వెయ్యి చెబుతారు.
🌹 అన్నింటి కంటే కష్టమైనది సహాయం చేయడం.
🌹 వెయ్యిమందిని అడిగితే ఒక్కరు చేస్తారు

🌹 తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.
🌹 తను చేసిన తప్పును సమర్థించుకునే వారు మూర్ఖులు
🌹 ఇతరుల తప్పును వేలు ఎత్తి చూపే వారు అత్యంత మూర్ఖులు
🌹చేసిన తప్పును సరిదిద్దుకునే వారు ఉత్తములు
🌹 ఏ కాలంలో అయిన మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే దైర్యం అయినా ఉండాలి.
🌹 లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి .

‌‌ 🌹 గొప్ప తనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు
🌹మన మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ ఎవరిని బాధపెట్టకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళమే
🌹 ప్రతీ దానిగురించి తీవ్రంగా ఆలోచించి అయాసపడటం తప్ప శాంతంగా ఉండటం ఆలోచించడటం మొదలు పట్టండి.
🌹 ఆరోగ్యంగా శక్తివంతంగా వుంటారు .
✍️
🌹🌹🌹🌹🌹
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.
మీ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment