Friday, June 10, 2022

చల్లని అనుభూతులు

చల్లని అనుభూతులు

ఒక్కొక్కసారి మనసు ఆనందంతో నిండిపోతుంది. గతదినం వేదనలో మూగబోయి రాత్రి నిదుర అనంతరం నిన్నటి కలతకు అంతగా కారణం కనిపించకపోయేసరికి మనసు తేలికపడుతుంది. చల్లని దేశాల్లో సూర్యభగవానుడి నులివెచ్చని కిరణాలు సోకినప్పుడు, వేడి దేశాలలో వాతావరణం చల్లబడి నాలుగు చినుకులు రాలి చలచల్లని మలయ సమీరం వీచినప్పుడు- మనసుకు ఎంతో హాయి కలిగి ఏనో తెలియని లోకాలకు వెళ్ళిపోతుంది. మనిషి ఆనందానుభూతులకు వాతావరణం ఓ పెద్ద కారణం అన్నప్పుడు ఆశ్చర్యం. కలుగుతుంది. మనసు ఆనందంతో నిండి ఆహ్లాదంగా ఉన్నప్పుడు అడిగిన వారికి, ఆడగనివారికి దానధర్మాలు చేయాలని కొందరికి అనిపిస్తుంది. అందుకే అంటారు. పెద్దలు సంతోష సమయాలలో వాగ్దానాలు చేయవద్దని
శ్రావణ, ఆశ్వీయుజ, కార్తికమాసాలు శుభ కార్యక్రమాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి. _మాసాలలో دان ఈ వైదిక, ఇటు ప్రార్ధనల రూపేణా మన్నించమని భగవంతుడిని మన సారా కోరుకోవడం కనిపిస్తుంది. శ్రావణమాసంలో చల్లని సాయం కాలాలు ఉవ్విళ్లూరిస్తాయి. శీతాకాల ప్రారంభమైన కార్తీకం ఇటు భక్తికి అటు ముక్తికి మార్గం చూపుతుంది. చల్లదనం ఎందుకు ఆహ్లాదం కలిగిస్తుంది. మనసుకు చలి ప్రదేశాలలో నీరు గడ్డకట్టే చలిలో ప్రజలు శీతల దుస్తులు ధరించి.. నులివెచ్చని అనుభూతులు సృజిం చుకొని ఆనందాన్ని అనుభవిస్తారు. శరీరం పిత్తదోషయుక్తమైనప్పుడు రక్తం వెచ్చని అనుభవాన్ని పంచుతుండగా శరీరానికి తగిలే చల్లనిగాలి మనసును సేదదీరుస్తుంది. ప్రకృతి తాపాన్ని పంచుతున్నప్పుడు చల్లని అనుభూతిని, శీత ప్రకోపం చెందినప్పుడు నులివెచ్చని అనుభూతిని మనసు కోరుకోవడంలో తప్పేముంది! అయినా అందులోని వైచిత్రి ఆశ్చర్యం గొల్పుతుంది. మనిషి తనకు దక్కింది చాలక మరేదో గొప్పదాన్ని కోరుకోవడం చిత్రమైన అనుభవమే! చీకటి రాత్రులలో వెలుగు కోసం, వెలుగు(ఎండ) ఉష్ణ ప్రకోసం చేస్తున్నప్పుడు చల్లని నీడ కోసం ప్రయత్నించడం ప్రాణుల సహజ లక్షణం. చెట్లను, నీడనిచ్చే చల్లని లోగిళ్లను ఆశ్రయించడం జీవులకు పరిపాటి

పెద్దలు పిన్నలను దీవించడం సంప్రదాయం. ఏదైనా పండుగను, పబ్బాన్ని పురస్కరించుకొని పెద్దలు, పండితులు తమకన్నా చిన్నవారిని నూరేళ్లు చల్లగా వర్ధిల్లమని దీవిస్తారు. చల్లదనం ఆయుష్షును పెంచే పదంగా ఉపయోగించడం విశేషం. సూర్యరశ్మిలో జీవకణాలు ప్రవర్ధిల్లుతాయి. విత్తనాలు జీవం పోసుకుంటాయి. మొక్కలు ఆకుల ద్వారా సూర్యకాంతిని స్వీకరించి పిండిపదార్థం తయారు చేసుకుంటాయి. అయినా చంద్రుడికే ప్రాముఖ్యం ఇచ్చి (ఔషధ మొక్కలకు చంద్రకాంతి కావాలట) చల్లదనాన్ని ఆహ్వానించి పిల్లలకు, ఆశీర్వాదం అందించడం పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment