ఖర వైఖరి
గమ్మత్తుగా ఉందా ఈ శీర్షిక! ఖరమంటే గాడిద! మనుషులకు సాధారణంగా గాడిద వైఖరే ఉంటుంది! గాడిద ఏం చేస్తుంది! ఇంకేం చేస్తుంది! చాకిరీ చేస్తుంది! దాన్నే గాడిద చాకిరీ అంటారు! మరి వైఖరి! అదే చాకిరీ చేసే వైఖరి! కానీ మనుషులు కూడా అలాగే బండ చాకిరీ చేస్తే విజయం సాధించడం ఎలా? మరి ఏ వైఖరిని మనుషులు అవలంబించాలి?
సానుకూల వైఖరి! చావో రేవో తేల్చుకునే వైఖరి! తెలివిగా, ఓర్పుతో పని రాబట్టుకునే వైఖరి! విజయం సాధించే వైఖరి! అది అలవరచుకోవడం ఎలా? అసలు మీలో ఉన్న సానుకూల వైఖరిని గుర్తించి దానికి పదును పెట్టుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ఎలా? మీకు సానుకూల వైఖరి ఉందా? లేదా? అది మీరెలా గుర్తించారు? ఎలా గుర్తిస్తారు! దానికి బండ గుర్తులు ఏమిటి?
ఒక పని చేయడానికి చొరవ తీసుకోవడమే మీ సానుకూల వైఖరికి తొలి మెట్టు! ఏ చొరవా తీసుకోనివాడికి అన్నీ కరవుగానే ఉంటాయి. ఏ పనిలోనూ విజయం సాధించలేరు. చొరవ తీసుకుని ముందడుగు వేయలేనివాడికి బతుకు బరువవుతుంది. బతుకంత బాధగా… కన్నీటి గాధగా… అని జీవితాంతం పాడుకోవలసిందే! మరి దీనికి సులభ సాధ్యమైన పరిష్కారం ఏమిటి? ఇంకేముంది?
సానుకూల వైఖరిని, (Positive Attitude) సాఫల్య వైఖరిని (Winner’s attitude) అభివృద్ధి చేసుకోవడమే! తొలి అడుగు ఎలా? మీరు ఏ పని చేయడానికైనా తీసుకునే చొరవ (Initiative) మీ ప్రగతికి తొలి బీజం! తొలి విత్తనం! తన ప్రగతికే విత్తనం వేసుకోలేనివాడికి, ప్రపంచం మీద పెత్తనం చేసే అధికారం లేదు! ఆ అవకాశం రాదు! అదే మీ సానుకూల వైఖరిని పది మందికీ అద్దంలో చూపించే దర్శనం! నిదర్శనం!
మీ సానుకూల వైఖరికి తొలి నిదర్శనం మీరు చొరవ తీసుకునే వైఖరి (Proactive attitude)! ఎప్పుడైతే మీరు చొరవ తీసుకుని, మీ సానుకూల వైఖరితో ముందడుగేశారో, అది మిమ్మల్ని ఉత్పాదక వైఖరి (Productive attitude) వైపు తీసుకెళుతుంది. అంటే మీరు తీసుకునే చొరవ వలన మీరు ఒక సేవ చేసి, లేదా ఒక ఉత్పత్తిని తయారు చేసి, మీ ఉత్పాదకతను పెంచుకుంటారు. ప్రదర్శిస్తారు.
ఎప్పుడైతే మీరు ఇటువంటి ఉత్పాదక వైఖరిని (Productive attitude), మీ చొరవే పునాదిగా అలవరచుకుంటారో, అప్పుడది అనివార్యంగా ప్రగతిశీల వైఖరి (Progressive attitude) అంటే ప్రగతిశీల దృక్పధం అవుతుంది.
ఎప్పుడైతే మీరు ప్రగతిశీల వైఖరితో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటారో అప్పుడు మీరొక ప్రగతి ప్రవాహ కేంద్రం అవుతారు ! మీ ఉనికితో మీ చుట్టూ ప్రగతిని ప్రవహింపచేసే కీలక కేంద్రం (Center of Excellence) అవుతారు! మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలా తయారవుతారు. మీ దృక్పధానికి, విజయ సాధన వైఖరికి (Winning attitude) లోకం విస్తుపోతుంది.
అప్పుడు మీరు ఖర వైఖరి నుండి సానుకూల వైఖరి వైపు పయనిస్తూ, జీవిత విజయ యాత్రలో సాఫల్యాలు నిరంతరాయంగా సాధిస్తూ, ప్రపంచమంతా విజయాల వెలుగులు ప్రసరింపచేస్తారు! మీరే నిలువెత్తు సానుకూల వైఖరిలా (Personified attitude), సానుకూల వైఖరికి నడిచే నిలువెత్తు చిరునామాలా నిలుస్తారు!
అప్పుడు మీ చుట్టూ ఆనందం అర్ణవమవుతుంది. వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధి అంబరాన్ని తాకుతుంది!
విజయోస్తు!

No comments:
Post a Comment