" బాటసారి- కల్పవృక్షం. "
ఒక బాటసారి ప్రయాణమై
పోవుచు దారిలో ఒక మైదానము చేరుకొనెను. బయట ఎండలో నడిచి
అలసిసొలసి ఒక చెట్టునీడలో కూర్చుండెను. అతడీవిధముగా తలపోసెను.
" ఇక్కడ నిద్రించుటకు ఒక పాన్పు లభించిన ఎంత సుఖముగా ఉండునో! "
ఆ చెట్టు కల్పవృక్షం అయిన కారణంచేత
వెంటనే ఆయన కోరిక ప్రకారము అక్కడ
చక్కని పానుపు ప్రత్యక్షముకాగా ఆ
బాటసారి అమితాశ్చర్యము చెంది ఆ
పాన్పుపై పరుండెను. ఆయన ఆలోచనలు అంతటితో ఆగలేదు.
"ఒక సుందరి వచ్చి నెమ్మదిగా పాదము
లొత్తిన ఇంకెంత బాగుండునో కదా?
అనుకున్న వెంటనే ఆ కల్పవృక్ష మహిమ
వలన ఒక సుందరి ప్రత్యక్షమై ఆయన పాదములు ఒత్తసాగెను. అమందానంద
భరితుడైన ఆయనకు ఒక్కసారిగా ఆకలి
పుట్టినది. వెంటనే ఊహించసాగాడు.
"కోరినదంతయు లభించుచున్నది.
మధుర పదార్థాలు లభించకుండునా?"
తక్షణమే నానావిధ రుచికర పదార్థాలు
ప్రత్యక్షమైనవి. తృప్తిగా తిని పడుకుంటూ
జరిగిన సంఘటనలతో మైమరచి "ఇపుడు హఠాత్తుగా ఏదేని పెద్దపులి వచ్చి నన్ను గుటుక్కున మింగదు కదా?"
ఇలా అనుకొనగానే నిజముగానే పులి
ప్రత్యక్షమై వానిపై ఉరికి మెడ కొరికి ఆ
బాటసారిని చంపివేసెను.
సాధారణంగా లోకులు ఇదేవిధముగా
ఆలోచించెదరు. కీర్తి గౌరవములను
వాంఛించి దేవుని ప్రార్థించినపక్షమున
ఆ కోరికలు కొంతవరకు ఫలించును.
కాని వాటివెనుకనే రోగములు,శోకములు
ధనహాని, మానహాని లాంటి పెద్దపులులు
సజీవమైన పులులకన్న వేెయి రెట్లు భయంకరమని కావున జాఖరూకతగా ఉండవలెనని శ్రీరామకృష్ణ పరమహంస
బోధించుచున్నారు.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment