🌎విశ్వమే ప్రకృతి
భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుని మనుగడయే కష్టం.
మానవుడు ఈ భూమిపై అవతరించి తన అవసరాలను తీర్చుకొనుటకు ప్రకృతిమీదనే ఆధారపడుతున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలాలు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాసులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ముఖ్యవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుండి లభించేవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్ల నీడను సౌధాలుగా చెట్ల నారను పట్టు వస్త్రాలుగా కాయలు, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభమునుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలనం ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నది. మానవుని ప్రజ్ఞా ప్రాభవాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లాగా విహరింపజేస్తున్నాయి. సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికిని దీని ప్రభావంతో ప్రకృతి దెబ్బతింటున్నది. పూర్వకాలంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కందమూలాలు ఆరగించి మూలికా ఔషధాలను వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించెడివాడు. నేటి మానవుడు పట్టణ జీవితానికి అలవడి కృత్రిమ ఆహారాన్ని కల్తీ ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాడు.
ప్రకృతికి మూలాధారాలైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటికి హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు- మనం ఇక్కడినుండి రాళ్ళతో కొడితే అవి మనకు అక్కడినుండి ఫలాలనందిస్తున్నాయి. మనకు అవసరమైన ప్రాణవాయువును, ఆకులు, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, రావి, మేడి, వేప, జమ్మి, ఉసిరిచెట్లను పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖ దుఃఖాలున్నవని జగదీశ చంద్రబోసు నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన ‘నోబుల్’ బహుమతి పొందాడు.
ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియాశక్తి, ఘ్రాణాశక్తి ఉందని నిరూపించారు. సాధారణంగా సామాన్య మానవులకుండే లక్షణాలన్నియు చెట్లకూఉన్నాయి. చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకున్నది. చెట్లు దైవీ శక్తులను కలిగి ఉన్నాయి. అవి పిలిస్తే పలికే దైవాలు. భక్తితో చెట్లను పూజించి, ప్రదక్షిణలు చేసి ఏకాగ్రతతో ప్రార్థిస్తే వృక్షమాత అనుగ్రహించి ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిలో ఒక్కొక్క చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి మహత్తర శక్తులను కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని గ్రహించి వృక్ష సంపదను పెంపొందించిన దేశ సౌభాగ్యము ఇనుమడిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో- నిరంతరం నిష్కామ భావంతో ప్రకృతిని సేవిస్తూ, రక్షిస్తారో వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తానని అర్థం, ‘వృక్షో రక్షతి రక్షితః’ అని. మనం ప్రకృని కాపాడితే ప్రకృతి మనలను తన ఒడిలో పెట్టుకుని కన్నబిడ్డలా పరిరక్షిస్తుంది. ప్రకృతిని రక్షించు ప్రకృతిలో జీవించు. ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలిసి కొని భగవంతుడు అన్నింటా వ్యాపించి యున్నాడని అన్ని ప్రాణుల యెడ భూతదయ కలిగి రక్షించుట మానవ ధర్మం. ఇదే వేద సారాంశం.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment