Monday, August 1, 2022

🙏🌷సనాతన హైందవ ధర్మం ఔన్నత్యాన్ని మరువకూడదు ప్రతి హిందూవు జాగో హిందూ🌷🙏

  🙏🌷సనాతన హైందవ ధర్మం ఔన్నత్యాన్ని మరువకూడదు ప్రతి హిందూవు జాగో హిందూ🌷🙏 


 మానవాళి పుస్తక భాండాగారంలో మన ఋగ్వేదం ప్రథమ గ్రంథం. ఇతర దేశాలలో మానవులు అనాగరికులుగా ఉన్నప్పుడు, మన దేశంలో ప్రజలు సంస్కారవంతులుగా జీవించే వారు. షాహియాన్‌, హ్యూన్‌సాంగులు చైనా నుంచి రాయబారులుగా వచ్చి, మన దేశంలోని ప్రజల నీతి నియమాలను ఎంతగానో మెచ్చుకున్నారు. 'దొంగతనాలు లేవు.' తలుపులు తీసి ఉండేవి, ప్రజలకు అబద్ధం అంటే ఏమిటో తెలియదు, అంటూ ప్రశంసించారు. వైజ్ఞానికులుగా మనమేమీ తీసిపోము. సూర్య, చంద్రగ్రహణాలు సెకండ్లతో మన పంచాంగాలలో మొదటి నుంచి ఉన్నాయి. ఖగోళశాస్త్రం, ఇతర శాస్త్రాలతో సహా సాహిత్య పరమైన రచనా రంగాలలో ఎందరో మహనీయులున్నారు. ఆర్యభట్ట, వరాహ మిహురుడు, కాళిదాసు ఇందుకు ఉదాహరణలు. దైవముఖంగా వచ్చిన వేదాలు ఇప్పటివరకు ఉద్భవించినప్పటి నుంచి స్వరయుక్తంగా గురుశిష్య సంప్రదాయంగా ముఖత: రావడం ఒక అద్భుతమే. అసాధ్యమే. వేదోపనిషత్తులలోని ముఖ్యసూత్రాలు యావత్‌ మానవాళికి శాశ్వతంగా వర్తించేవి. 'సత్యం వదం ధర్మం చర', 'సత్యమేవ జయతే', 'త్యాగేనైన అమృతపుత్ర:' 'పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం' 'అహింసో పరమో ధర్మ:' ఇవన్నీ మన సంస్కృతిని చాటేవే. ఇవన్నీ హిందూధర్మానికి పునాదులు. ఐన్‌స్టీన్‌ ఇలా అన్నారు.' 'సున్నా హిందువులు ఇచ్చినదే. దీనివల్లనే వైజ్ఞానిక శాస్త్రం పెరిగింది. ఇందుకు మనం హిందువులకు ఎంతో రుణపడి ఉన్నాం'. పాశ్చాత్యులే భగవద్గీత విశిష్టతను ఎంతగానో కొనియాడారు. ప్రపంచ విఖ్యాత బ్రిటిష్‌ చరిత్రకారుడు ఆర్నాల్డ్‌ టాన్చీ ఇలా అన్నారు'. 'పాశ్చాత్య నాగరికత పతన దశలో ఉంది. ప్రస్తుత మానవాళి ప్రమాద పరిస్థితులలో బుద్ధుడు, గాంధీ ఇచ్చిన భారతీయ మార్గమే శరణ్యం'. చికాగోలో వివేకానందుని ఉపన్యాసం విన్న తర్వాత ఒక ప్రఖ్యాత దినపత్రిక 'ఇంత విజ్ఞాన వంతమైన భారతదేశానికి, మిషనరీలను పంపడం ఎంతో తెలివితక్కువ' అంటూ వ్యాఖ్యానించింది. ఇక మన వేదోపనిషత్తుల ఘనతను ఎందరో ప్రముఖ పాశ్చాత్యులే ప్రశంసించారు. 


 మాక్స్‌ముల్లర్‌, స్కోపన్‌హోర్‌ మాటల్లో చెప్పాలంటే. ఉపనిషత్తులలోని అత్యున్నతమైన, తేజోవంతమైన సత్యాలు, బోధనలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇవి సర్వమానవాళికి వర్తించేవి. నిత్య జీవితానికి శాంతిని, ఆనందాన్ని ఇచ్చేవి. మరణ సమయంలో కూడా వేకువలో సూర్యరశ్మి లాగా, నిర్మలమైన కొండ గాలి లాంటివే అవి. అర్థం చేసుకుంటే ఎంతో సుళువు. హిందూ మతం లేకపోతే నలందా, తక్షశిల, ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాలకు ఉనికి ఉండేదే కాదు. పాశ్చాత్య పాలనలో నష్టపోయిన స్వధర్మాన్ని పునరుద్ధరించుకోవడం మన కర్తవ్యం. చక్రవర్తి రాజగోపాలాచారి ఇలా అంటున్నారు, 'వివేకానందుడు హిందూధర్మాన్ని రక్షించాడు. హిందూ ధర్మం ఉంది కాబట్టే స్వాతంత్య్ర సమరం శాంతియుతంగా జరిగింది. లేకపోతే స్వాతంత్య్రం వచ్చేది కాదు. అందుకే స్వతంత్ర భారతావని వివేకానందునికి ఎంతగానో రుణపడి ఉంది.' గోపాలాచారి గారు రామాయణ, భారతాలపై ఆంగ్లంలో పలు గ్రంథాలను రచించి, హిందూ ధర్మం గొప్పతనాన్ని తేటతెల్లం చేశారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా భగవద్గీత గీతపై వ్యాఖ్యానాలను రచించి భగవద్గీత అమూల్య సందేశాన్ని అందరికీ తెలియచేశారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. నోబుల్‌ లా రియల్‌ రిచెర్డ్‌ ఎర్నెస్ట్‌ అభిప్రాయం ప్రకారం, 'భారతీయులు (హిందువులు) జ్ఞాపకశక్తికి, సహజ ఆలోచనకు, మేధస్సుకు, పరిపూర్ణ విజ్ఞానానికి కారణం భారత, భాగవత రామాయణ, గీతలలోని పరిజ్ఞానమే' 'మన పూర్వీకుల ఘనతను మనమే విస్మరిస్తే భారతదేశానికి భవిష్యత్తు లేదు అని వివేకానందుడు అన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మన దేశపు ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ మున్ముందు ఎన్ని జన్మలెత్తినా భారత దేశంలోనే జన్మించాలని కోరుకున్నాడు. గాంధీ అంతటి గొప్ప నాయకుడు మరెవరైనా ఉన్నారా? ఒక బ్రిటిష్‌ ప్రఖ్యాత పత్రిక మాటల్లో ఒక్క భారత దేశమే, ఒక్క హిందూ మతమే, గాంధీ మహాత్మునికి జన్మనివ్వగలదు.' గాంధీ మన దోషాలను మనమే సవరించుకుందాం అని అన్నారు. ఇతరుల జోక్యం అవసరం లేదన్నారు. 


 సత్యసాయి బాబా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసా సూత్రాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఆయన జన్మించిన పుట్టపర్తి అన్నిమతాలవారికి కేంద్రం ఔతున్నది. సత్యసాయి సేవా కార్యక్రమాలు, వైద్య, విద్యావిధానాలు ప్రపంచానికే ఆదర్శం. బ్లిట్జ్‌ సంపాదకుడు కరంజియా సత్యసాయి గురించి చెబుతూ, ఈ భారతీయుడు భగవత్స్వరూపుడు అని అన్నారు. 


 డాక్టర్‌ అంబేద్కర్‌ గొప్ప దేశభక్తుడు, హిందూమతం నుంచి వచ్చిన బౌద్ధమతమే తీసుకున్నాడు. హింసతో కూడిన, విచ్చలవిడితనంతో కూడిన పాశ్చాత్య మతాలు మనకు ఎంతమాత్రం వద్దని పదే పదే చెప్పాడు. 


 పాశ్చాత్య దేశాలలో క్రైస్తవం క్షీణిస్తోందని పోప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ చర్చిలకు వెళ్ళేవారు తగ్గుతున్నారు. మన దేశంలో హిందూమత ప్రాబల్యం వల్లనే ప్రజాస్వామ్యం ఉంది. మిడి మిడి జ్ఞానంవారి వల్ల దేశం ముందంజ వేయలేదు. పరిపూర్ణ విజ్ఞానం అవగాహన ఉన్నవారే దేశాన్ని రక్షించగలరు. బ్రిటిష్‌ ప్రధాని బ్రిటన్‌లో ఇతర జాతుల వారు ఎందరో ఉన్నా, బ్రిటన్‌ క్రిస్టియన్‌ దేశం అన్నప్పుడు, భారతదేశం సనాతన ధార్మిక దేశం ఎందుకు అవకూడదు? 


 తిలక్‌, గోఖలే, గాంధీ లాంటి నాయకులు మన ధర్మంలోని విశిష్టతను చాటి క్రైస్తవం మన దేశాన్ని ఈ ఉద్యమాన్ని పూర్తిగా కబళించకుండా ఆపారు. మన ధర్మం అందరినీ ఇముడ్చుకొనేది. ఎవ్వరినీ వెలివేయదు. సత్యం ఎప్పటికైనా నెగ్గుతుంది. 

No comments:

Post a Comment