Friday, August 19, 2022

జ్ఞాన శక్తి!!

 !!ఓం శ్రీ సద్గురువే నమః.!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
!జ్ఞాన శక్తి!!
🔥🔥🔥🔥
‘యథైధాంశి సమిద్ధోగ్నిః భస్మసాత్‌ కురుతేర్జున
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్‌ కురుతే తథా’

అగ్ని ఏ విధంగా కట్టెల మోపును దగ్ధం చేస్తుందో... అలా జ్ఞానమనే అగ్ని మన జీవితంలోని కర్మలన్నింటిని భస్మం చేస్తుంది. కర్మలన్నింటినీ తీసివేసినపుఁడు ‘జ్ఞానస్వరూపం’ మిగిలిఉంటుంది. జ్ఞానాగ్ని రగులుతున్నప్పుడు ఎటువంటి అనుభవాల్ని అయినా అది భస్మం చేసి ఎల్లప్పుడూ నిన్ను నిర్మలంగా ఉంచగలుగుతుంది. జ్ఞానమనేది ఒక దీపం వంటిది. జీవితంలో ఎదురయ్యే విషాద పరిస్థితులను పనికిరాని స్వల్ప ఘర్షణలను, అంధకారమును చక్కగా తొలగించి వెలుగును ప్రసాదించి జీవితపు మార్గమును చూపుతుంది.

‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్సయం యోగసంసిద్ధః కాలేనాత్మనివిద్దతి’

ప్రపంచంలో జ్ఞానం కన్నా పవిత్రమైనది మరేదీ లేదు. ఈ పద్ధతిలో సాగుతున్న కొద్దీ అగ్ని రగులుతుంది. ఆ అగ్నే జ్ఞానాగ్ని జ్వాలలుగా రగులుతుంది. ఆత్మనే నిజ స్థితి అని తెలుసుకుంటావు. జీవితాన్ని అర్థవంతంగా నడపగలిగిన శక్తి లభిస్తుంది. దీనివలన మనస్సు స్థిరముగా ఉంటుంది.

‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్యాపరాంశాంతిం అచిరేణాధిగచ్ఛతి’

శ్రద్ధ లేకున్న ఏదీ పొందలేము. శ్రద్ధ లేకుండా ఆత్మ జ్ఞానం కలగదు. ఇందుకు ఇంద్రియ వ్యవస్థను అదుపులో పెట్టుకోవాలి. అదుపులో ఉంచిన శక్తిని ఉన్నతమైన శక్తిగా మార్చుకోవాలి. అప్పుడే వ్యక్తి గొప్పగుణాలలో ప్రవేశిస్తాడు. ఇటువంటి జ్ఞానం ప్రాప్తించిన వెంటనే శాంతి లభిస్తుంది. ‘వ్యక్తి ఆంతరంగిక స్థితి నుండి వచ్చినదే శాంతి. భౌతిక స్థితి నుండి వచ్చినదంతా ఉద్వేగం అవుతుంది. అంతరాత్మ నుండి వచ్చినదే శాంతి. ఈ శాంతి అనుభూతి అయినప్పుడు నీవు శాంతిమయుడవుతావు’ అని పరమాత్మ చెబుతున్నారు.

మార్గదర్శి, జ్ఞానప్రదాత, శ్రీ సద్గురు కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.
ఓం సర్వేజనా సుఖినోభవంతు. శుభమస్తు.

No comments:

Post a Comment