Friday, August 19, 2022

పనికిరానిది ఏదీలేదు

🙏🌸🌼🌸🌼🕉️🌼🌸🌼🙏   
           *పెద్దలమాట చద్ది మూట*     
🙏🌸🌼🌸🌼🕉️🌼🌸🌼🙏
*ది.19-8-2022*

                 *పనికిరానిది ఏదీలేదు*
                           🕉️
సృష్టిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవారే అరుదు - అని తెలియజెప్పే శ్లోకం.
శ్లో||
*అమంత్రమ్ అక్షరం నాస్తి*
*నాస్తి మూలమ్ అనౌషధమ్!*
*అయోగ్యః పురుషో నాస్తి*
*యోజకః తత్ర దుర్లభః!!*
                             🌹
*మంత్రం కాని అక్షరం లేదు - ఔషధంగా పనికిరాని మొక్క లేదు. అలాగే పనికిరాని మనిషీ లేడు. కానీ, అక్షరాలలో, మొక్కలలో, మనిషిలోవున్న గొప్పతనాన్ని గుర్తించి వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసిన సంయోజకుడు (నిర్వాహకుడు) చాలా అరుదుగా ఉంటాడు.*
                             🌹
విడివిడిగా వ్యక్తులందరూ సమర్థులే కావొచ్చు. కానీ, వీరందరినీ సంఘటితం చేసే వ్యక్తి కావాలి. అతడే సంయోజకుడు. ఉపయోగపడే వస్తువులు ఉన్నా, వాటిని సమర్థవంతంగా ఉపయోగించే జ్ఞానం ఉన్న వ్యక్తే సంయోజకుడు.
ఏ అక్షరమూ మంత్రబద్ధం కాకుండా ఉండదని (అ+ఉ+మ్=ఓమ్) గుర్తించే ఋషి, ఫలానా మొక్క ఆకులు, ఫలానా జబ్బు నివారణకు పనికొస్తాయి అని చెప్పే ఆయుర్వేద వైద్యులు, ఈ వ్యక్తిలో ఈ మంచిగుణం ఉంది, ఫలానా పనిలో రాణిస్తాడు అని గుర్తించే నిర్వాహకుడు అరుదు.
*"పనికిరానివారు ఎవ్వరూ లేరు - వారిచే సరిగ్గా పనిచేయించుకోకపోవడమే లోపం." (Nobody is useless, they are used less) అని అంటూండేవారు, స్వామి చిన్మయానంద..! మనిషిలోని అర్హతలను గుర్తించి, వారు ఏ ఉద్యోగానికి పనికొస్తారో తెలియజెప్పే నేర్పరి అయిన నిర్వాహకుడు అవసరం..!!*
*ఇటువంటి విషయాలను నిశితంగా పరిశీలించి, మనలోని సామర్థ్యాన్ని వెలికితీసి, దానిని సమర్థంగా అమలు చేయగల సద్గురువులు లభించటం మన అదృష్టంగా భావించాలి!!*
                            🕉️
*శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శుభాభినందనలు..!!*
*శివాయ గురవే నమః*
సేకరణ:-
*జంధ్యాల మోహన సత్యసాయి*
🙏🌸🌸🌼🕉️🌼🌸🌼🌼🙏

No comments:

Post a Comment