🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖 *"రమణ మహర్షి"* 💖💖
*ప్రశ్న: గురువు అనుగ్రహమనగా ఏమిటి ?*
*"జవాబు: గురువు పని లోపలనే. గురువు ఆంతర్యములోను, బాహ్యం లోను వుంటాడు. నిన్ను లోపలికి తీసుకు వెళ్ళే పరిస్థితులను కల్పిస్తాడు. నిన్ను లోపలికి తోస్తాడు. లోపలి గురువు నిన్ను లోపలికి లాక్కుంటాడు. నీవు కేంద్రంలో స్థిరమైపోతావు. గాఢ నిద్రలో నీవు (అహం) కేంద్రంలోనే వుంటావు. మేలుకుంటే బయటకి వస్తావు. వెంటనే ఇది, అది అని ఆలోచిస్తావు. దీన్ని సరిచేయవలెను. ఇది లోపల, బయట వుండే గురువుకే సాధ్యము. ఆయనని శరీరంగా గుర్తిస్తావా. మనకు బాహ్య ప్రపంచం మీద పట్టుండాలని, దాన్ని జయించాలని మనం ప్రయత్నం చేస్తూంటాము. మనకు విసుగు పుట్టి ఆంతర్యములోకి వెళితే, మానవాతీత శక్తి ఒకటి వుందని గుర్తిస్తాము. ఆ శక్తిని ఒప్పుకొని గుర్తించాలి. ఈ అహం అనునది శక్తివంతమైన ఏనుగు వంటిది. అది సింహంలాంటి బలసంపన్నునకు తప్ప ఇక దేనికీ లొంగదు. ఆ సింహం గురువు తప్ప మరొకటి కాదు. సింహం యొక్క చూపే ఏనుగును గజగజలాడించి చంపేస్తుంది. మన అహం ఎప్పుడు నశించి పోతుందో అపుడే అపుడే మన వైభవముండునని గ్రహిస్తాము. ఆ స్థితి రావాలంటే భగవంతునికి శరణాగతి చెంది, ప్రభూ నీవే నాకు రక్ష అని ప్రార్థించాలి. అపుడు గురువు ఈ వ్యక్తికి అర్హత వున్నదని చూసి గురువు మార్గదర్శి అవుతాడు. మౌనం లోని హృదయభాషణమే అత్యున్నతమైన శిక్షణ."*
No comments:
Post a Comment