Tuesday, August 2, 2022

మనసులో ఆధ్యాత్మిక భావాలు కలుగడానికి....

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺 🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*


_*🌴మనసులో ఆధ్యాత్మిక భావాలు కలుగడానికి సత్సంగం మంచి వేధిక. ఎట్టివారి చెంత ఉంటామో అట్టివారి ఆలోచనలు, గుణాలే మనకు అంటుకుంటాయి. కడివెడు పాలకు ఒక్క విషపు చుక్క కలిపినా చాలు కదా, ఆ పాలు అన్నీ విషపూరితం కావడానికి. ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం చాలు మనిషిని అధ:పాతాళానికి నెట్టడానికి. మనలో ఎన్ని సుగుణాలు ఉన్నాయా అని కాదు ఎన్ని దుర్గుణాలను బయటకు నెట్టేసామా అనేది ముఖ్యం. మంచి మిత్రులు ఎంతమంది ఉన్నా పరవాలేదు. కానీ దుర్మార్గుడు ఒక్కడున్నా చాలు, జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక ఈ విషయములో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.🌴*

No comments:

Post a Comment