🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺
🌴మోక్షమును కోరుకొనువారు ప్రాపంచిక విషయముల యందు అభిమానము, మోహము వదిలిపెట్టాలి. వినయం, విధేయత కలిగి ఉండాలి. అహంకారము, దేహాభిమానం వదిలిపెట్టాలి. అవివేకము, అజ్ఞానము నుండి బయటపడాలి. మనలో ఉన్న గొప్పతనం అంతా పరమాత్మ అనుగ్రహంగా భావించాలి. మనము అనుభవిస్తున్న సకల సౌకర్యాలు భగవంతుని ప్రసాదమే అని గ్రహించాలి. రాములు వారు కన్నా రావణుడికి ఎన్నో విద్యలు తెలుసు. కాని రావణుడిని ఎవరూ పూజించరు. కారణం అతనిలో వినయం లేదు, అహంకారం తప్ప. రాముడిని అందరూ దేవుడిలా పూజిస్తారు కారణం రాముడు అహంకారి కాదు. తల్లితండ్రుల మాట, గురువు మాట విన్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకే రాముడు దేవుడయ్యాడు. 🌴
No comments:
Post a Comment