Saturday, August 20, 2022

🌹నేటి ఆత్మ విచారం. 🌹

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి 
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ            
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092                                                   🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿🙏🏽
 🌸💥🌸💥🌸💥🌸💥🌸

            🌹నేటి ఆత్మ విచారం. 🌹

యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు?


ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన|| 

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు?


పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన|| 

తా:-  పండిన ఆకులు చెట్టునుండి                             ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?


 ఏక వృక్ష సమారూఢ                                     నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన|| 

తా:-  చీకటి పడగానే అనేక జాతుల పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగా. బంధువులతో కూడిన  మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడనవసరములేదు.


ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన|| 

తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.

✡సర్వేజనాః సుఖినోభవంతు.👏
☸శుభమ్ భూయాత్.🔥

No comments:

Post a Comment