🎻🌹🙏 మన మహర్షుల చరిత్ర...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ఇప్పుడు మనం గౌతమ మహర్షి గురించి తెలుసుకుందాం . ఈ మహర్షులందరూ ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు .
🌸ప్రతీ మహర్షిలోనూ ఒక ప్రత్యేకతే . అందరూ వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళే . మరి గౌతమ మహర్షి నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందామా ?
🌿గౌతమ మహర్షి బ్రహ్మమానసపుత్రులలో ఒకడు . విష్ణుమూర్తి ఒకసారి మోహిని వేషం వేసుకుని దేవతల్ని రాక్షసుల్ని మోహంలో పడేశాడు .
🌸ఈ మోహినిని చూశాక అందరికీ బ్రహ్మగారి సృష్టి చప్పగా అనిపించింది . అందుకని అహల్యని సృష్టించి గౌతమ మహర్షికి సేవ చెయ్యడానికి పెట్టాడు .
🌿 బ్రహ్మ అహల్యని గౌతముడికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆయన కోరిక . కాని గౌతముడు మాత్రం పెళ్ళి చేసుకుంటానని అనలేదు .
🌸ఇంద్రుడు మొదలైన దేవతలందరు అహల్యని తమకిచ్చి పెళ్ళి చెయ్యమని బ్రహ్మని అడిగారు . ఎవరు భూప్రదక్షిణం ముందుగా చేసి వస్తారో వాళ్ళకి అహల్యనిచ్చి పెళ్ళి చేస్తానని చెప్పాడు బ్రహ్మ .
🌿అందరూ భూప్రదక్షిణం మొదలు పెట్టారు . కానీ గౌతముడు తనకి సమీపంలో ఉన్న ఆవుకి ప్రదక్షిణం చేసి ఇదే భూప్రదక్షిణంతో సమానమని చెప్పాడు .
🌸బ్రహ్మ ఇది నిజమేనని గౌతమ మహర్షికి అహల్యనిచ్చి పెళ్ళి చేశాడు . దేవతలందరూ ఇంద్రుడితో తిరిగివచ్చి అహల్యా గౌతముల్ని అభినందించి వెళ్ళిపోయారు .
🌿కష్టపడకుండా గౌతమ మహర్షి ఉపాయం చూశారా ! కానీ ఇంద్రుడికి మాత్రం అసూయే . దండకారణ్యంలో గౌతమ మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు .
🌸 బ్రహ్మ ప్రత్యక్షమై గౌతముడు ఉన్నచోట భూమి ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుందని వరం ఇచ్చాడు . తర్వాత శతశృంగగిరి అనే చోట ఒక పర్ణశాల కట్టుకుని గౌతముడు అతిథులకి చక్కటి భోజనం పెట్టడం మొదలు పెట్టాడు .
🌿 ఒకసారి భూభాగం అంతటా కరువు వచ్చింది . గౌతముడు ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన చోట అందరూ ఆకలితో చచ్చిపోతున్నారు .
🌸 కొంతమంది ఆకలికి ఆగలేక శవాల్ని తినేస్తున్నారు . కొంతమంది గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు . వస్తున్న వాళ్ళందరికి అహల్య గౌతములు భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చారు .
🌿 అలా కొంతకాలానికి ప్రజలు తండోపతండాలుగా భార్యాపిల్లలతో కలిసి వచ్చి అక్కడే బ్రతికేస్తున్నారు .
🌸 విఘ్నేశ్వరుడు గౌతముడి వ్రతం భంగం చెయ్యాలని అక్కడికి వచ్చి ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు . ఆ ఆశ్రమం భూలోక స్వర్గంలా మారిపోయింది .
🌿 విఘ్నేశ్వరుడు గౌతమ మహర్షి సహాయంతో శివుడి జటాజూటంలో వున్న గంగను భూమి మీదకి తీసుకువస్తే అమ్మ పార్వతికి సవితిపోరు తప్పుతుందని అనుకుని బ్రాహ్మణులందరిని అక్కడ్నించి తీసుకుపోవడానికి ఉపాయం ఆలోచించాడు .
🌸అహల్య చెలికత్తెని ఆవు రూపంలో గౌతముడి పొలంలో మెయ్యమని చెప్పాడు విఘ్నేశ్వరుడు . గౌతముడు ఒక గరిక తీసి దానిమీద వేశాడు .
🌿 అది భస్మమయిపోయింది . గోహత్యా పాతకం చేశాడని బ్రాహ్మణులు , అసూయతో స్త్రీలు అహల్యాగౌతముల్ని నిందించారు .
🌸బ్రాహ్మణుల్ని నాకు పాపం నుంచి విముక్తి ఎలా కలుగుతుందని అడిగాడు గౌతముడు . శివుణ్ణి మెప్పించి ఆయన జటాజూటంలో ఉన్న గంగను భూమిమీదకి తెస్తే ముక్తి కలుగుతుందని చెప్పారు బ్రాహ్మణులు .
🌿 గౌతముడు దివ్యదృష్టితో తనకి ఇలాంటి స్థితి ఎలా వచ్చిందని చూసి బ్రాహ్మణులు అసూయతో చేశారని తెలుసుకుని వాళ్ళని బండరాళ్ళుగా మారిపొమ్మని శపించాడు .
🌸వాళ్ళు గౌతముణ్ణి క్షమించమని అడిగారు . శ్రీకృష్ణుడు భూలోకంలో పుట్టాక మీ శాపం తీరుతుందని చెప్పాడు గౌతముడు .
🌿 ఇంక విఘ్నేశ్వరుడు దైవకార్యం కోసం అడిగాడు కదా అని గంగను భూమిమీదకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు .
🌸 గౌతముడు అహల్యతో కలిసి హిమవత్పర్వతం మీద ఒంటి కాలిమీద నుంచుని శివుడి కోసం కఠోరతపస్సు చేశాడు .
🌿శివుడు ప్రత్యక్షమై ఏంకావాలో అడగమన్నాడు . గౌతముడు గంగాదేవిని భూమిమీదకి పంపించమని వేడుకున్నాడు .
🌸గంగాదేవి ఆవు మరణించిన చోట ప్రవహించింది . ఆవు బ్రతికింది . బ్రాహ్మణులందరు గంగలో స్నానం చెయ్యడానికి వస్తే గంగ దూరంగా వెళ్ళిపోయింది .
🌿గౌతముడు మళ్ళీ గంగను బ్రతిమలాడి తీసుకువచ్చాడు . అప్పటినుంచి దానికి ' గౌతమి ' అని పేరు . గోవుని బ్రతికించింది కాబట్టి '
🌸గోదావరి ' అనే పేరుతో ప్రవహించింది . గౌతముడికి శతానందుడనే పేరు గల కొడుకు పుట్టాడు .
🌿అతనికి శరద్వంతుడని కూడా పేరుంది . అతడు పుట్టగానే తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు . తర్వాత గౌతముడికి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .
🌸 ఆంజనేయుడి తల్లి అంజన గౌతముడి మొదటి కూతురు . రెండవ కూతురు ఉదంక మహర్షి బార్య . అహల్య పెళ్ళి సమయంనుంచీ ఇంద్రుడు అహల్యమీద కోరిక పెంచుకున్నాడు .
🌿 ఒకనాటి అర్థరాత్రి గౌతమాశ్రమానికి వచ్చి కోడిలా కూశాడు . ఇంద్రుడు . గౌతముడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళాడు .
🌸 ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్యతో గడిపాడు . అహల్య ఇంద్రుడని తెలియక గౌతముడే అనుకుని అతని కోరిక తీర్చింది .🌿 ఇంకా తెల్లవారలేదని తిరిగి వచ్చిన గౌతముడితో అహల్య మహాత్మా ! మీరిక్కడే వున్నారుగా ! మళ్ళీ బయటనుంచి రావడం ఏమిటి ? ఆశ్చర్యంగా ఉంది అంది .
🌸ఇంద్రుడు పిల్లిలా వెళ్ళిపోదామనుకున్నాడు . పిల్లి వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసి గౌతముడు మహాపతివ్రత అయిన అహల్యని మోసం చేశావు కాబట్టి నీవు మగాడివి కాకుండా పోతావు .
🌿నీ రాజ్యమంతా శత్రువులు ఎత్తుకుపోయి నీ ఇంద్రపదవి పోయి నువ్వు నాశనమయిపోతావు అని శపించాడు .
🌸తెలియక ముట్టుకున్నా నిప్పు కాలకుండా ఉండదు కదా ! అలాగే తెలియక చేసినా తప్పు తప్పే . నువ్వు చైతన్యం లేని రాయిలాగా పడి ఉండమని శపించాడు అహల్యని .
🌿అహల్య గౌతముడి కాళ్ళమీద పడి వేడుకుంది . శ్రీరాముడి పాదం తగలలగానే నీకు శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు .
🌸ఇంద్రుడికి కూడ శాపవిమోచనం చెప్పాడు గౌతముడు . కొంతకాలం తర్వాత ఇంద్రుడుకి మళ్ళీ ఇంద్రపదవి వచ్చింది .
🌿అహల్య కూడ శ్రీరామ పాదస్పర్శతో మామూలు మనిషిగా మారి గౌతముడి సేవలో ఉండిపోయింది .
🌸గౌతమ మహర్షికి బ్రహ్మదత్త మహారాజు ప్రతిరోజు భోజనం పెడ్తున్నాడు . ఒకరోజు భోజనం చేస్తుండగా ఒక మాంసం ముక్క వచ్చింది .
🌿గౌతముడు బ్రహ్మదత్తుణ్ణి గ్రద్దవై పుట్టమని శపించాడు . బ్రహ్మదత్తుడు శాపం తీరే ఉపాయం చెప్పమని గౌతముణ్ణి ప్రార్థించాడు .
🌸 రాముడి చెయ్య తగలగానే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు గౌతముడు .
🌿గౌతమ మహర్షి “ గౌతమ ధర్మసూత్రాలు ” అనే గ్రంథాన్ని లోకానికి అందించాడు . అలాగే “ న్యాయశాస్త్రం ” , “ జ్యోతిషశాస్త్రం ” కూడ రాశాడు .
🌸 గౌతముడు ఎంత గొప్పవాడో ఆయన భార్య అహల్య కూడ అంత గొప్ప ఇల్లాలు , మహాపతివ్రత .
🌿ఇదండీ గౌతమ మహర్షి చరిత్ర 🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
సేకరణ

No comments:
Post a Comment