Monday, August 22, 2022

ప్రశ్న :--- మేం మా పిల్లలకు ధ్యానాన్ని ఎలా బోధించాలి?

🔺 పత్రీజీ సమాధానాలు🔺
🌹 చాప్టర్ --10:--- చిన్న పిల్లలకు ధ్యానం 🌹

🍁 ప్రశ్న :--- మేం మా పిల్లలకు ధ్యానాన్ని ఎలా బోధించాలి? 

🍀 పత్రీజీ :--- మనం పిల్లలకు ధ్యానాన్ని నేర్పేటప్పుడు పెద్దలకు నేర్పించిన విధంగానే బోధించనవసరం లేదు. కేవలం వాళ్ళ వయస్సు ఎన్ని సంవత్సరాలో, అన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కూర్చోమంటే చాలు. ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకోవాలి అని చెప్పాలి. అది సరిపోతుంది వాళ్ళకు. 

🍁 ప్రశ్న :--- పిల్లలకు ధ్యానం నేర్పించటం ఎందువల్ల సులువు అవుతుంది? 

🍀 పత్రీజీ :---  పిల్లలకు పెద్ద పెద్ద ధ్యాన ప్రక్రియల అవసరం లేదు. వాళ్ళు ఊరికే 5-10 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటే సరిపోతుంది అంతే. పిల్లలకు మూడవ కన్ను ఉత్తేజితమై ఉంటుంది. పెద్ద వాళ్ళ మాదిరిగా మూడవ కన్ను మూసుకుపోయి ఉండదు.

🌿 మీరు చిన్న పిల్లలు కానట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. చిన్నపిల్లలు ఎప్పుడూ దేవుని రాజ్యంలోనే వర్ధిల్లుతూ ఉంటారు. మీరేమీ వాళ్ళను అక్కడికి నెట్టవలసిన అవసరం లేదు.

🏵️ ఏదైనా చక్కని సంగీతాన్ని వినిపిస్తూ కళ్ళు మూసుకొమ్మని చెప్పండి చాలు. వాళ్ళు శ్వాసధారను గమనించవలసిన అవసరం లేదు. వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళ థర్డ్ ఐ యాక్టివ్ గా ఉండటం వల్ల వారి వారి అనుభవాలన్నీ మీకు చెప్తారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.

No comments:

Post a Comment