#ఆస్కార్ వైల్డ్ కొటేషన్లు
నిజంగా నువ్వు ప్రేమించాలని వుంటే అది నీ కోసం కాచుకొని వుంటుంది.
ప్రతి మనిషి దేన్నయితే ప్రేమిస్తాడో దాన్నే చంపుతాడు.
రూపాన్ని బట్టి తీర్పు చెప్పలేని వాళ్ళు వివేచానపరులు కాదు.
ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపను.
ఖచ్చితమైన వ్యక్తిత్వమంటే ఎదిరించడం కాదు, శాంతి.
విద్యాభ్యాసం గౌరవనీయమే కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపయోగకరమైనదేది అక్కడ బోధించరని.
ఓ మానసిక రోగికి ప్రతి వస్తువు వెల తెలుసు కాని ఏ వస్తువు విలువ తెలియదు.
పిల్లల్ని మంచివాళ్ళుగా తీర్చిదిద్దాలంటే వాళ్లను సంతోషపెట్టడమే.
గతించిన రోజుల్ని కొనేంత ధనవంతుడు లేడు.
ఒక్కోసారి నేను అనుకుంటాను "దేవుడు మనిషిని సృష్టించడంలో తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు."
పురుషుడు నీతిగా ఉండటం కపటత్వం. స్త్రీ నీతిగా ఉండటం సహజం.
అతన్ని గురించి అతను ఆలోచించడం స్వార్ధం కాదు. అతన్ని గురించి అతడు ఆలోచించనివాడు ఆలోచించలేనేలేడు.
ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.ఆ తప్పు ఇక పునరావృతం కాదు.
తన తప్పుకు ప్రతివాడు పెట్టుకొనే అందమైన పేరు అనుభవం.
వాదనలు నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి.
మంచిగా వుండటం కన్నా, అందంగా ఉండటం మంచిది. అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది.
మనలో ఏదో కోల్పోయాం,అదే ఆశ.
చరిత్రంతా భావనల యుద్ధక్షేత్రమే.
గొప్ప ఆలోచనలన్నీ ప్రమాదభరితమైనవే.
ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్చతను బట్టి ఉంటుంది.
ఆవేశం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది.
అతి చెడ్డపని కూడా మంచి ఉద్దేశ్యంతోనే మొదలవుతుంది.
మంచికి ఆనందపు ముగింపు, చెడుకి భాధాకర ముగింపు అదే కధకు సరైన ముగింపు.
ద్వైదీభావంగా జీవించకు,చెడ్డవాడిగా కనిపిస్తూ అన్నివేళలా మంచి పనులే చేయకు,అదే కపటమంటే.
జాతీయత కల్పన యొక్క కోరిక.
☀
No comments:
Post a Comment