*నిర్వచనం*
నన్ను నేను ఎప్పుడూ నిర్వచించుకుంటూ వుంటాను.
నేను ఇట్లా,నేను అట్లా. నేను ఇది, నేను అది . నేను అంతే,నేను ఇంతే.
ఈ నిర్వచనం నన్ను నడిపిస్తుంది. ఇతరులతో నా సంబంధాన్ని నిర్ణయిస్తుంది. నా ఆలోచనలను ప్రభావితం చేస్తుంది . నా కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటుంది.
ఇలా నన్ను నేను నిర్వచించుకోడానికి దోహద పడే అంశాలు
1) నా మీద ఇతరులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు.
2) నా అనుభవాలు.
3) నన్ను నేను ఇతరులతో పోల్చుకోవడం.
4)నావిజయాలు,అపజయాలు.5) నా ఇష్టాలు, ఉద్దేశాలు, అంచనాలు. నమ్మకాలు.
*ధ్యానం అన్ని నిర్వచనాలను రద్దు చేసి నన్ను నన్ను గా వుంచుతుంది*
ఇట్లు
జీవించే వాడు లేని జీవితం.
No comments:
Post a Comment