141022e1702. 151022-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సో ....... హం ......
➖➖➖✍️
ఏమిటి ఈ అక్షర ప్రాముఖ్యత ....? ఏమిటి ఈ పవిత్రత .. అసలు సోహం అంటే…..
దీన్ని ‘హంస మంత్రం’ అంటారు. బ్రహ్మవైవర్త పురాణంలో హంస విశిష్టత గురించి బ్రహ్మ వివరిస్తాడు. వేదకాలంలో ‘హంస సోమరసం నుంచి జలాన్ని వేరుపరచగలదు’ అని చెపుతూ ఉండేవారు. పాలను, నీటిని వేరుచేసే శక్తిగల పక్షిగా హంసను గురించి చెపుతారు. మానస సరోవరంలో విహరించే పక్షిగా కుడా చెపుతూ ఉంటారు. దేవతలకు ఇష్టమైన పక్షిగా కుడా చెపుతారు. కారణం.. ‘పవిత్రత’ ‘శుద్దత’ ‘నిష్కళంకన’
యతీశ్వరులను పరమ హంసలుగా చెపుతారు.
‘ఆనందాత్మను నేను’ ‘నేను పరబ్రహ్మమును’ ‘అది నేనై ఉన్నాను’ ‘ఆ మహా చైతన్యం నేను’ అనే జ్ఞానం గలవారు పరమహంసలు.
‘సః అహం’..... కలిపితే ‘సోహం’ అవుతుంది. ‘పరమాత్మను నేను’ అని దీని అర్థం.
ఇది వేదాంతసారమైన మాటగా విఖ్యాతికెక్కింది.
ఉచ్ఛ్వాసం (గాలి పీల్చడం) చేసేటప్పుడు ‘సో’ అనే శబ్దం వస్తుంది. నిశ్వాసం (గాలి వదిలేటప్పుడు) ‘హం’ అనే శబ్దం వస్తుంది.
ఇది ప్రతి జీవీ తన ప్రయత్నం లేకుండానే చేసే జపం. దీన్ని ‘హంస మంత్రం’ అంటారు. ‘సోహం’ అనే మాటే ‘హంస’ అయినదని మన ఋషులు చెపుతూ ఉంటారు.
ఇక్కడ నీకు తెలిసినా తెలియక పోయినా ఊపిరి తీసుకుంటున్నావు అంటే నీవు ఎవరు? అవును అన్న ఎవరు కాదన్న సత్యం నీకు తెలిసినా తెలియక పోయినా నువ్వు బ్రహ్మ పదార్దానివే ..
కాకపోతే అద్దానికి మసి అంటుకుంటే నీ అసలు రూపం నీకు స్పష్టంగా కనిపించక తికమక పడి ఏవో భిన్న ఆకారాలను ఊహించుకుంటు ఉంటావు ..
కొన్నింటిని చూసి ఏడుస్తావు మరికొన్ని చూస్తూ నవ్వేస్తావు ..
ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే మసిని జ్ఞానం అనే తుండుతో తుడిచి వేస్తావో ,, నువ్వు ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది .
‘సోహం’ అనే మాటే ‘హంస’ అయినదని విజ్ఞులు వివరిస్తారు.
‘పరమహంస’ అంటే ఎంతో పవిత్రులు. వారి ఆలోచనలో ఆచరణలో మాటలో మనసులో తనువూ తలపులు అన్ని పవిత్రం ...
ఎక్కడ ఉన్నా ... ఏమి చేస్తున్నా ...... ఒకే ఒక్కటి ....
సోహం ............. సోహం .........సోహం .........✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment