🙏🚩బుగ్వేదం (రుద్రుడు శివుడు)
ఒకవైపు ఉగ్రం మరోవైపు శాంతం🚩🙏
🌷🌷🌷🌷🌷🌷
తొట్టతొలి వేదమైన ఋగ్వేదం రుద్రుడి విశేషాల్ని ఇలా వివరిస్తుంది. ఆయన రూపం గురించి వివరంగా చెబుతుంది. రుద్రుడు తెల్లటి తెలుపు రంగులో
మెరిసిపోయే గొప్ప తేజస్వి. సూర్యుడిలా అత్యంత * జాజ్వల్యమానంగా బంగారంలా ప్రకాశిస్తుంటాడు.
జటను ధరించి ఉంటాడు. అందుకే ఒకచోట 'కపర్దిన' అని కూడా
పిలవడం జరిగింది. ఆయనకు సహస్రనేత్రుడు అంటే (వేయికళ్లున్నవాడు.) (వేయికి అనంతమైన అని మరో అర్థం కూడా ఉంది.) నీలగ్రీవుడు (నీలవర్ణంగల కంఠం కలవాడు.) శివుని ప్రధాన ఆయుధం విద్యుత్ శరం. దీన్ని ఆకాశం నుండి భూమిపైకి విసిరితే భూమి చీలుతుంది. దీన్ని మనం పిడుగు అంటుంటాం. ఈ దేవుడి ఆయుధాలైన విల్లు,
బాణం గురించి ఋగ్వేదంలో చాలా వివరాలున్నాయి. మరోచోట ఆయన్ని 'దివోవరాహ' అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఆకాశవరాహం. ఎందుకంటే దట్టమైన నల్లటి మేఘాలమాటున మెరిసే తెల్లటి మెరుపులు పుట్టిస్తాడు కనుక ఆ మెరుపులు వరాహానికి ఉన్న కోరపళ్లవలె ఉంటాయి కనుక. 'కల్పలీకుడు' అనే పేరుతో మరోసారి పిలిచారు. ఎందుకంటే ఆకాశంలో మెరిసే మెరుపులు.. భూమిపై పడే పిడుగులు వీటిని కలిగించేది రుద్రుడే ఇంతటి విలయకారకుడిగా వివరించిన ఈ వేదంలోనే మరోచోట రుద్రుడి సౌమ్య రూపాన్ని వివరిస్తూ ఆయన్ని 'మహాభిషక్' అని పిలిచారు. మహాభిషక్ అంటే సమస్త ఓషధులకూ... వ్యాధివినాశానికి నాయకుడై గొప్ప గొప్ప వ్యాధుల్ని.. జబ్బుల్ని నయం చేసే మహావైద్యుడు. ఈయన వద్ద వేలకొద్దీ ఔషధాలుంటాయి. ఈయన వర్షఋతువులో అత్యంత శక్తిమంతుడౌతాడు. అలాగే రుద్రుడు సంతానకారకుడు కూడా. ఈయన కరుణిస్తే మానవజాతికి శుభాల్నీ.. పశువులకు రక్షణని కలుగజేస్తాడు. అందుకే ఋగ్వేదంలో ఇతడిని శివుడు.. పశుపతి అనే పేర్లతో పిలిచారు.
No comments:
Post a Comment