🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"470"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"కనిపించే ఈ సృష్టి ఉనికిని, నిరంతర పరిణామాలను సాధనాక్రమంలో ఏ విధంగా స్వీకరించాలి ?"*
**నదిలో నీటి బిందువు ఏదీ స్థిరంగా నిలిచి ఉండదు. అలా నిలిచి ఉంటే దానిని నది అని పిలవం. నీటి ప్రవాహమే నది ప్రత్యేకత. నదికి ప్రవాహం ఎంత సహజమో ఈ సృష్టికి పరిణామం అంత సహజం. ప్రవాహాన్ని ఎంతో సహజంగా భావిస్తున్న మనం, జీవితంలో జరిగే మార్పులను మాత్రం అలా స్వీకరించలేక పోతున్నాము. స్థూలంగా ఒకేరకంగా కనిపించే మన దినచర్యలో కూడా అనేక సూక్ష్మమైన మార్పులు ఉంటాయి. ఒక ఉద్యోగి ప్రతిరోజూ వెళ్ళేది అదే కార్యాలయానికే అయినా తాను వేసుకునే వస్త్రాల్లో, వెళ్ళే సమయంలో, దారిలో కనిపించే దృశ్యాల్లో ఎన్నో మార్పులు వుంటాయి. సున్నితమైన మనసుతో పరిశీలిస్తే, ప్రకృతిలో ప్రతిక్షణం జరిగే మార్పును మనం గమనించవచ్చు. నిరంతర ప్రవాహంలాంటి ఈ పరిణామానికే మనం "కాలం" అని పేరు పెట్టుకున్నాం. అందుకే ఈ సృష్టి ఉనికికి, పరిణామానికి కారణమైన భగవంతుడే కాలస్వరూపుడు అయ్యాడు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment