🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"17"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*
*"కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు."*
*"కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు."*
*"భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే."*
*"అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి."*
*"చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి."*
*"రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి."*
*"రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి."*
*"అలాంటివాడు కేవలం “దొంగే” అవుతాడుగాని “రాజు” ఎన్నటికీ కాలేడు."*
*"అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు."*
*"కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది."*
*"ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా!"*
*"అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి."*
*"మోక్షం కావాలంటే మోహం వదలాల్సిందే మరో మార్గం లేనే లేదు. అలా పవిత్ర కర్మలు చేసే పవిత్రులకు మాత్రమే మోక్షం సులభతరం అవుతుంది."*
*"అలాంటి పవిత్రులకు మోక్షమార్గంలో సకల దేవతల అండ కోరకుండానే లభిస్తుందని తెలుసుకోవాలి."*
*"అలాగే మన లక్ష్యం మోక్ష్యం అయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో గాని వారి గొప్పలతో గాని మన జీవితాలను పోల్చుకోగూడదు."*
*"డబ్బు సంపాదిస్తే ఏవేవో సుఖాలు లభిస్తాయి అనే కామంతో డబ్బు సంపాదించడానికి అస్సలు ప్రయత్నం చెయ్యకూడదు."*
*"ఈ డబ్బు నాకు కాదు."*
*"ఇది నా కర్తవ్యపాలన కొరకు మాత్రమే."*
*"నాకు కావాల్సింది ఈ ముల్లోకాలలో ఏదీ లేదు."*
*"నన్ను నేను దర్సించుకోవడమే నా జీవిత లక్ష్యం అని నిత్యం మనసులో భావిస్తూ వుండాలి."*
*"జీవిత పర్యంతం ఈ శరీరానికి ఒక్క మితమయిన ఆహారం ఇవ్వడం తప్ప మరోదాని మీద ఏమాత్రం ఆసక్తి కలగకుండా చూసుకోవాలి."*
*"లోక విషయాలు ఏమాత్రం మనసులోకి రానివ్వకుండా వీలైనంత మౌనంగా ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వుండాలి."*
*"లోకంలోని ఏ వస్తువుతోగాని జనులతోగాని ఎలాంటి అనుబంధాలు ఏర్పరచుకోగూడదు."*
*"మనసులోంచి ఆశను లోకం మీద ఆసక్తిని క్రమేణా తగ్గిస్తూ రావాలి."*
*"మోక్షం లక్ష్యంగా కలిగిన వారు పెళ్లి అయినవారు కానివ్వండి లేదా పెళ్లి కానివారు కానివ్వండి ఎవరయినా సరే “బ్రహ్మచర్యం” మాత్రం తప్పక పాటించాల్సిందే."*
*"అయితే పెళ్లి అనే బంధాన్ని ఏర్పరచుకున్న వారు పిల్లలకు జన్మనివ్వడం అనే లోక మర్యాదను పాటించి ఇక ఆ తర్వాత నుంచి బ్రహ్మచర్యం పాటించాలి."*
*ఎప్పటివరకు అంటే..*
*"ఎప్పటివరకూ అయితే ఈ శరీరం నిలిచి వుంటుందో అప్పటివరకూ బ్రహ్మచర్యం పాటించాల్సిందే."*
*"ఎందుకంటే సంభోగం అనేది శరీరాలను ఉపయోగించి పొందే ఆనందం."*
*"మోక్షం అనేది నేను శరీరం అనే భావన నుంచి బయటపడ్డ వారికే లభిస్తుంది."*
*"ఒక ప్రక్క ఈ శరీరాలను ఉపయోగించి ఏదో కల్పిత ఆనందం పొందుతూ మరియొక ప్రక్క ‘ఈ శరీరం నేను కాదు’ నా లక్ష్యం మోక్షం అని నాలుకతో పలికితే ‘ఆత్మానుభవం’ కలగదని అందరూ అర్ధం చేసుకోవాలి."*
*“బ్రహ్మచర్యం” పాటించకుండా మోక్షం అనే స్వస్వరూప స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదని అందరూ గ్రహించాలి."*
*"అలాగే మనం ఎవరినయినా ఏదయినా ఆటలో ఓడించాలంటే అందులో వారి శక్తి ఎంతటిదో ముందే తెలుసుకుని వారికంటే అధిక శక్తిని మనం కలిగిఉండి ఆటలోకి ప్రవేశించాలి."*
*"అప్పుడే మనం వారిని ఏ ఆటలో అయినా ఓడించగలం."*
*"లోకంలో బలవంతుని చేతిలో బలహీనుడు ఓడిపోవడం అనేది అందరూ ఎరిగిన సర్వసాధారణమైన విషయమే గదా!"*
*"కాబట్టి మనం మోక్షాన్ని గనక పొందాలనుకుంటే మరణాన్ని జయించాలి."*
*"మరణాన్ని జయించాలంటే మరణం కంటే శక్తివంతమయిన ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి."*
*"మరణం కంటే శక్తివంతమయిన ఆయుధ మేదయినా మానవుని వద్ద ఉందా అంటే అతడి వద్ద అలాంటి ఆయుధం ఒకటి తప్పక ఉంది అనేదే విస్పష్టమయిన సమాధానం."*
*"మానవుని వద్ద ఉన్న మరణాన్ని జయించగలిగే ఆ ఒకే ఒక్క వజ్రాయుధమే బ్రహ్మచర్యం."*
💖🔥💖🔥💖
💖🕉️💖
No comments:
Post a Comment