Tuesday, February 28, 2023

ఆత్మానందము..."

 🙏🕉🙏                  ..... *"శ్రీ"*

   🔥 *"ఆత్మానందము..."*  🔥
   🔥⚜️🔥⚜️🔥⚜️🔥
         🔥⚜️🕉⚜️🔥
               🔥⚜️🔥
                     🔥
*"బోధ్కోన్యసాధనేభ్యో హి*
*సాక్షాన్మోక్షైక సాధనం |*
*పాకస్య వహ్నివత్‌ జ్ఞానం*
*వినా మోక్షో న సిద్ధ్యతి ||"*

*"తా || వంట చెయ్యటానికి అగ్ని ఎట్లా ప్రధాన సాధనం అయి ఉందో అట్లాగే మోక్షాన్ని పొందటానికి ఆత్మజ్ఞానం ముఖ్య సాధనం అయి ఉంది. ఇతర సాధనాలతో పోల్చినప్పుడు గురుబోధ అనే ఆత్మజ్ఞానం ఒక్కటే మోక్షానికి ఉత్తమమైన సాధనం."*

*"వివరణ..."*

*"దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకొని, ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించటమే నిజమైన జ్ఞానం అయి ఉంది. గురువు శిష్యునికి జ్ఞానాన్ని ఇవ్వటం అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వు దేహానివి కావు, నీ పరమేశ్వరుడు నీ లోనే ఉన్నాడు, నీ ఆత్మని నువ్వు తెలుసుకొని నీ చైతన్యాన్ని నీ సత్‌ తో కలుపుమని జ్ఞానాన్ని బోధిస్తాడు. అపరోక్ష జ్ఞానాన్ని శిష్యుడు అవగతం చేసుకొనేటట్లు చేస్తాడు."*

*"దేహమే నేను అని అనుకోవటమే అజ్ఞానమని, దాన్నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించమని శిష్యునికి గురువు బోధిస్తాడు. చిత్‌ సత్‌ తో కలుపటానికి కావలసిన సాధన మార్గాన్ని బోధించి శిష్యుడు సచ్చిదానందాన్ని అనుభవించేటట్లు చెయ్యగలగుతాడు. జ్యోతిర్బ్రహ్మను, నాదబ్రహ్మను, శబ్దబ్రహ్మను, అమృత బ్రహ్మను అనుభవించటానికి కావలసిన సాధన మార్గాన్ని గురువు శిష్యునికి ప్రసాదించి శిష్యుడు తానే బ్రహ్మగా నిలిచేటట్లు చెయ్య గలుగుతాడు. ఇదే ఆత్మజ్ఞానానికి నిజమైన మార్గం."* 

*"లోకంలో సాధకునికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగమార్గం అని అనేక మార్గాలు ఉన్నప్పటికి ఆత్మబోధకు, ఆత్మానందానికి జ్ఞానమార్గం ఒక్కటే సరైన దారని ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేశారు."*

*"సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు కదా.. అదే విధంగా వంటకు కావలసిన పప్పు, ఉప్పు, బియ్యం, కారం, చింతపండు, కాయగూరలు, నూనె వగైరా అన్నీ ఉన్నా తింటానికి కావలసింది తయారు కాదు గదా... అగ్ని లేకపోతే పదార్థాలన్నీ కూడా వాటి పూర్వస్థితి లోనే ఉండిపోతాయి.. పొయ్యి కింద నిప్పుపెట్టి, పదార్థాలను అన్నిటిని తగు పాళ్ళలో ఉపయోగించి వంట చేసినప్పుడే కదా కావలసిన రుచి, తింటానికి పదార్థం లభిస్తుంది. పదార్థాలు పక్వం అవ్వటానికి, ఆహారం తినటానికి నిప్పు ఎంత అవసరం అయిందో అదే విధంగా ఆత్మానందాన్ని అనుభవించటానికి ఆత్మజ్ఞానం కూడా అంతే అవసరం."*

*"తపస్సు, మనో నిగ్రహం, శాస్త్రజ్ఞానం, జ్ఞాన విచక్షణ, వివేకం, శ్రద్ధ మొదలైనవి అన్నీ కూడా పారమార్థిక జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయే కాని.. మోక్షానికి కావలసిన ఆత్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. గురువు ప్రసాదించే ఆత్మజ్ఞానం మాత్రమే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని ప్రసాదించ గలుగుతాయి. కావున సాధకుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని గురుజ్ఞానంద్వారా మాత్రమే పొంద గలుగుతాడు. పుస్తకాల్లో ఎన్ని రాసి ఉన్నా జీవించి ఉన్న గురువు ద్వారా ప్రత్యక్షంగా వాటి సాధనలను, సాధక బాధకాలను అవగాహన చేసుకొని అనుభూతిని పొందినప్పుడే సాధకుడు నిజమైన జ్ఞానం ఏమిటో గ్రహించ గలుగుతాడు. ఆత్మను తెలుసుకొన్న వాడికి ఈ జీవితమనే శోక సముద్రాన్ని దాటటం తెలుస్తుంది. పుట్టింది దుఃఖించటానికి కాదు, ఆత్మానందాన్ని అనుభవించటానికి అని తెలుస్తుంది."*
             🔥⚜️🔥⚜️🔥
                   🔥🕉️🔥
               

No comments:

Post a Comment