👉#కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది.
కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది...
👉'#జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు.
👉#ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది.
👉#సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు'
ఆధ్యాత్మిక సాధన అంటే ఎమిటి..?
*మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని సాధనలు చేసిననూ ప్రయోజనము లేదు!*
*దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు..!*
*నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు , జపాలు చేస్తుంటారు..*
*కానీ వీటి వలన పుణ్యం రాదు, ఇవన్నీ మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే…!*
*నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే, చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు!*
*ఉపవాసాలు ఉండడం వలన కోరికలు తీరుతాయి అనుకుంటే, నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడు ఎప్పుడో ధనవంతుడు అయ్యేవాడు..,!*
*అత్యాశ, సోమరితనం వలన మానవుడు ఇట్టి భ్రమకు లోనగుచున్నాడు...!*
*ఇవన్నీ చేయకూడదు అని కాదు, చేయాలి.... కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకోవాలి!*
*ఏనాడు మన హృదయాలు పరిశుద్ధమై పరమాత్మ కొరకు పరితపిస్తాయో ఆనాటి నుంచి మనం నిజమైన పుణ్యాత్ములవుతాము.*
*ధన్యాత్ములవుతామని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకోవడమే ఆధ్యాత్మిక సాధన..!
*దైవం-- ధ్యానం--సమస్యలు--సెల్ఫ్ ద్వారా.*
దైవం అంటే ఒకొక్కరికి ఒకో రకైమైన అవగాహన అనుభవంలోకి వస్తుంది.. అది ఇది అనే చెప్పేవీలు ఉండదు ఉంటే అది మానవ రాజకీయమే... దైవం మానవరూపేణ అంటే అవసరానికి మనకు ఉపయోగపడే ప్రతిఒక్కరూ దైవంతో సమానమే.. అంతా ఒప్పుకుంటాం.. కానీ ఎప్పుడూ మానవ ప్రయత్నం వల్లకాని పని దైవం చేస్తుంది అని అంతా నమ్ముతాం... ఇక్కడే మొదలు మన కత.
మొదట్లో మనం మెడిటేషన్కి వచ్చినప్పుడు ఇది ఎక్కువగా మననోటినుంచి వస్తుంది... తరువాత మనం పరిణితి చెందే కొలది దైవం కాస్తా ఇన్నర్ అవుతుంది... దానినే మనం సెల్ఫ్ అంటాం.. సెల్ఫ్ అని చెప్పటానికి కారణం ఇక్కడ మన సమస్యలు మనమే పరిష్కరింప చెసుకునేది సెల్ఫ్ ద్వారానే.. సెల్ఫ్ అనేది దైవలక్షణం లేదా మనలోని దైవమే.. దైవం అంటే భౌతికమైన పదం...
ఇక్కడ సెల్ఫ్ లేదా దైవం రెండూ ఒక్కటే అంటే అంతా ఒప్పుకోవచ్చు లేదా ఒప్పుకోకపోవచ్చు కానీ మన సమస్యలు మనం తీర్చుకోగలము అంటే సెల్ఫ్ అంటే పరిణితి పొందిన...
పూర్ణ అవగాహన లేకపోతే దైవం... అంతే తేడా.. కానీ అదే పని సెల్ఫ్ చేసింది అంటే ఋజువుకావాలి.. దైవం చేసింది అంటే సహాయం చేసిన వ్యక్తి ద్వారా అని మనం అనుకుంటాం... ఇది మనం మన మనస్సులో అనుకునే విధానం... ఇదంతా ఎందుకు అంటే సమస్యలు వస్తాయి వెళతాయి కానీ మన అవగాహన మాత్రం సమస్యలు వచ్చినకొద్ది పెరుగుతూనే ఉంటుంది అది స్పష్టం..
సమస్యలు వస్తున్నకొద్ది మనం రాటుతేలే మాట ఎంత వాస్తవమో... ప్రశాంత వాతావరణం కోరుకునే మాట కూడా అంతే వాస్తవం.. అంటే ద్వైతం... ఎప్పుడైతే సమస్యలు సెల్ఫ్ కి ట్రాన్స్ఫర్ చేస్తామో మనం సహనం నేర్చుకుంటూ సాక్షిగా సమస్యను చూడటం అలవాటు అవుతుంది. అంటే మన శక్తిని సంరక్షించుకోవాలి దానికి దారి మళ్ళీ సెల్ఫ్ ద్వారా... ప్రయత్నం చేస్తాము..
ఇక్కడ మనము ఎదురుచూడం.. ప్రయత్నం చేస్తాము.. ధ్యానం మనకు ఉపయోగపడే తీరు ఇదే..
- ఆదిత్య
No comments:
Post a Comment