Monday, February 27, 2023

ఓర్పు అవసరం

 *ఓర్పు అవసరం*

ఎవరైనా శ్రమ కలిగిస్తూన్నప్పుడు దానిని సహించడానికి 'క్షమ' అని అంటారు. క్షమలో రెండు రకాలున్నాయి. ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతీకారం చూపడానికి శక్తి లేనందువలన కొంతమంది సహించి ఉంటారు. అది మొదటి రకం, ప్రతీకారం చూపడానికి తగిన శక్తి ఉండి కూడా అలా చేయకుండా సహించి ఉండటం రెండవ విధమైనది. ఇదియే నిజమైన క్షమ.
ఎవరైనా మనకు అపకారం చేస్తే తిరిగి అతనికి అపకారము చేయడానికి ప్రయత్నము చేయగూడదు. అలాచేస్తే అతనికి దుఃఖం కలిగించిన పాపం మనకు వస్తుంది. అతడు మనకు కావాలని అపకారం చేశాడా, తెలియక చేశాడా అనేది ముందు తెలుసుకోవాలి. కావాలని చేయకపోతే ఆ విషయాన్ని అక్కడికి వదలి వేయాలి. కావాలని చేస్తే తగిన సలహా ఇచ్చి అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. మనం ప్రతీకారం చేయకపోతే దానివల్ల అతడు పశ్చాత్తాపం చెంది తనకుతాను సరిదిద్దుకొనడానికి అవకాశం ఉంది.
కోపాన్ని జయించని వానిలో క్షమాగుణం ఉండదు. కోరికతోను, దురాశతోను కలిపి కోపాన్ని అంతర శత్రుకోటిలో పరిగణించారు. అందుచేత కోపాన్ని, జయించాలి

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/

No comments:

Post a Comment