🔥రహస్యకిరణాలు🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సూర్యుడు మనకు పైకి కన్పిస్తున్నట్లు వెలుగును, వేడినీ, శక్తినీ మాత్రమే అందివ్వడం లేదు. అంతకన్న గొప్ప విశేషమైన కానుకగా మనకు ప్రేరణాశక్తిని అదృశ్య వరదానంగా ప్రసాదిస్తుంటాడు. అంతఃకరణ గురించి తెలిస్తే ఇది అర్థమవుతుంది. మనకు ప్రేరణ అక్కణ్ణించే రావాలి. వేరుదారి లేదు. ఏ ఆలోచన ద్వారా ప్రేరేపించబడ్డా అది మంచిగానీ, చెడుగానీ అది ఆ సూర్యుని అదృశ్య కిరణాల ద్వారానే సంభవము. (వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించిన మహాసత్యము.)
వైజ్ఞానికుల అధ్యయనం ప్రకారం యీ భూమికి, ఆ సూర్యుడికీ మధ్య 9 కోట్ల 25 లక్షల మైళ్ళదూరం ఉంటుంది. నిమిషానికి వంద చొప్పున అంకెలు లెక్కపెడుతూ అన్నము, నీళ్ళు, నిద్ర మానేసి అదే పనిలో ఉంటే 11 నెలలు పడుతుంది 9,25,00,000 లెక్కబెట్టడానికి, మరి అంతదూరంలో ఉన్న ఆ సూర్యభగవానుడే మన ఆలోచనలకు ఆధారము అన్నారు. 13 లక్షల భూగోళాల్ని కలిపి ఆ సూర్యగోళంలో పడేస్తే గాని ఆ గోళం నిండదు. అంతటి విశాలమైనది ఆ సూర్యగోళము. అట్టి సూర్యభగవానుని ప్రేరణతోనే మన బుద్ధి పనిచేసేది. భూగోళము, 7900 మైళ్ళ వ్యాసము గల్గి ఉండటంవల్ల ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 23 గం॥ల 56 ని॥లు పడుతోంది. అసలు ఆ ప్రదక్షిణకూడా సూర్యుని యొక్క ఆకర్షణ శక్తితోనే జరుగుతోంది. అలా ప్రదక్షిణ చేయడం వల్లనే మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అది తిరగడం తెలీడం లేదు. ఆ సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తితో బంధింపబడ్డ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి భూమికి 365 రోజులు'
పడుతోంది. రోజులో - భాగం ఎక్కువ పట్టడంతో మనకు 4 సం॥ల కొకసారి లీపు సంవత్సరం వస్తోంది. ఆ సం॥మునకు 366 రోజులు ఉంటాయి. ఇది మనందరికీ తెల్సిందే...
అలాగే సూర్యుణ్ణించి నుంచి వస్తోన్న 'విశ్వవ్యచ' అనే కిరణలతో శుక్రగ్రహం ఏర్పడుతుంది. ఇది భూమికీ, సూర్యుడికీ మధ్య ఉంటుంది. ఇది దాని చుట్టూ అది తిరగటానికి 30 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగటానికి 225 రోజులు పడుతుంది. అంటే అక్కడ పగలు 112 రోజులు. రాత్రి 112 రోజులు అన్నమాట. +..
సూర్యుని నుంచి 'విశ్వకర్మ' అనేటువంటి కిరణాలు ప్రసరిస్తుంటాయి. ఆ 'విశ్వకర్మ' అనే కిరణాలతోనే బుధగ్రహం ఏర్పడింది. యీ బుధగ్రహం సూర్యుడికి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం 3 కోట్ల 60 లక్షల మైళ్ళు మాత్రమే. దూరంలోనే ఉంటూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది. ఇది చాలా చిన్న గ్రహం. దీని వ్యాసము 3 వేల మైళ్ళు. మాత్రమే అందుకే తనచుట్టూ తాను తిరగటానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే 44 రోజులు పగలు, 44 రోజులు రాత్రి అన్నమాట...
ఇక మనం కొంచెం దృష్టిని ఆవలివైపుకు సారిస్తే భూమి నుంచి 4 కోట్ల 90 లక్షల మైళ్ళ దూరంలో 'కుజ' గ్రహం ఉన్నది. ఇది సూర్యునియొక్క 'ఉదన్వసు' అనే కిరణాలతో ఏర్పడ్డది. ఇది దానిచుట్టూ అది తిరగటానికి 24 గంటల 37 నిమిషాలు పడుతోంది. అంటే అక్కడ పగలు, రాత్రి దాదాపు భూమి మీదలాగానే అన్నమాట. అదే సూర్యుడిచుట్టూ ప్రదక్షిణ చేయడానికి 687 రోజులు పడుతోంది.
సూర్యుని నుంచి వస్తూన్న 'ఉదావసు' అనే కిరణాలతో బృహస్పతి గ్రహం ఏర్పడింది. ఇది చాలా పెద్దది. భూమి కంటే దాదాపు
వెయ్యి రెట్లుంటుంది. ఇది సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 12 సం॥లు పడుతుంది. అంతటి భారీ గ్రహమైన గురు గ్రహం తనచుట్టూ తాను తిరగటానికి 9 గంటల 50 నిమిషాలు మాత్రమే పడుతోంది. అంటే అక్కడ పగలు కేవలం 4 గం॥ 55 ని॥లు రాత్రి 4 గం॥ 55 ని||లు అన్నమాట. ఇంకో చిత్ర మేమంటే అంత చిన్నరాత్రిలో అక్కడ 12 మంది చంద్రులు ఒక్కసారిగా వెన్కెలకాస్తారు...
తర్వాత సూర్యుని నుంచీ వస్తోన్న 'విశ్వవ్యచ' అనే కిరణాలతో శనిగ్రహం ఏర్పడ్డది. శుక్రగ్రహం జననానికి కారణమైన అవే విశ్వవ్యచ కిరణాలతో ఏర్పడ్డ శనిగ్రహం మరణాన్ని తెలియజేస్తుంది. మనలో చాలామంది ఈ గ్రహాన్ని చెడుగా భావిస్తారు. అది ఎంత మాత్రమూ సరియైనది కాదు.🌺 మన జీవితాల్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు సహకరించే ఈ గ్రహప్రభావం మనల్ని ఆధ్యాత్మిక పథం వైపు నడిపేందుకు ప్రేరేపిస్తుంది. మన జీవితాల్లో శనీశ్వరుని యొక్క అనుగ్రహం అత్యంత ఆవశ్యకం. మనల్ని ఉన్నత పథం చేర్చాలనే శనీశ్వరుని తపన అనన్య సామాన్యము.
ఈ కలియుగమునందు శనీశ్వరుని యొక్క ఆధిపత్యమును మనకు అవగాహన అవటంకోసమే శబరిమల యాత్ర, అయ్యప్పదీక్ష వంటివి అందించారు. మన శరీరములో మూలాధార చక్ర సంబంధిత బంధ విముక్తి కొరకు, పూర్వజన్మ సంచిత వాసనలను చక్కగా మూటగట్టి ముడివేసి "స్వామి నీవే శరణు ! అనేక జన్మల నుంచి. నన్ను వెంటాడి, బంధనాల్ని కలిగిస్తోన్న వాసనల ము చేతిని నా 29/46 కుసంస్కారాల మూట అందుకోవయ్యా ! నన్ను ఉద్దరించే దైవము నీవే. శరణు ! శరణు !" అంటూ ఎలుగెత్తి పిలుస్తూ నలభైదినముల కఠోరదీక్ష చేస్తోన్న అయ్యప్పస్వాములు నిజముగా అదృష్టవంతులు. అయినా అవగాహనతో పై విషయాలనెరిగి వీటిని చెయ్యడం వల్ల ఆ దీక్ష మరింత ప్రయోజనకారి కాగలదని, మరెన్నో ఆశ్చర్యకరఫలితాలను అందివ్వగలదనీ గ్రహించగలరు. అటువంటి శనిగ్రహం తనచుట్టూ తాను తిరగడానికి 10 గంటల 14 నిమిషాలు పడుతుంది. అదే సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 29 సం॥లు పడుతుంది. అందుకే దీన్ని మందగ్రహం అన్నారు...
యురేనస్' అనే గ్రహం తనచుట్టూ తాను తిరగటానికి శనిగ్రహానికి లానే 10 గం॥ 48 ని॥ పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సం॥లు పడుతుంది.
'నెఫ్యూన్' అనేగ్రహం తనచుట్టూ తాను తిరగటానికి 15 గం॥ 48 ని॥లు పడుతుంది. 'ఫ్లూటో' అనేగ్రహం తనచుట్టూ తాను తిరగటానికి 6 7 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగటానికి 248 సం॥లు పడుతుంది. ఈ మూడు గ్రహాలు 'హరికేశ' అనే కిరణాలతో ఏర్పడ్డవే.
మన సౌరకుటుంబంలో ఈ మహాసదస్యులేకాక మరికొన్ని క్షుద్ర గ్రహాలుకూడా ఉన్నాయి. అట్టి ఈ బ్రహ్మాండానికి సూర్యుడు అధిపతి. అందువల్లనే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్యుణ్ణించీ వచ్చే వివిధ కిరణాలతో గ్రహాలేర్పడ్డట్లే సూర్యుణ్ణించీ వస్తోన్న 'హరికేశ' అనే కిరణాలతో నక్షత్రాలేర్పడ్డాయి. మనకి కనిపిస్తోన్న సూర్యగోళము సూర్యుని భౌతిక శరీరము. 'సవిత' సూర్యుని యొక్క మనస్సు. 'అగ్ని' సూర్యుని యొక్క ఆత్మ, భూమి మీదున్న సూర్యకేంద్రాన్నే 'శంబల' అన్నారు. మనుషులు యొక్క సూర్యకేంద్రం సహస్రారముగా ఋషితుల్యులు పేర్కొన్నారు.
అంతటి సూర్యగ్రహము తనచుట్టూ తాను తిరుగుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన ధృవనక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 24 కోట్ల సం॥లు పడుతుంది. దీని ప్రభావం సంపూర్ణ సౌరకుటుంబం మీద ఉంటుంది...
.
సేకరణ.....
🍁సర్వేజనాసుఖినోభవసంతు 🍁
No comments:
Post a Comment