*సంసారమంటే....*
✍️ శ్రీ రమణమహర్షి
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼
🌹 ‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?' - అని అడిగాడు శిష్యుడు.
ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ...
✳️ *'సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?'* అని ఎదురు ప్రశ్నించారు రమణులు.
✳️ 'ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది' అన్నాడతను.
✳️ దానికి ఆయన నవ్వి, 'అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ, కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?' అన్నారు.
✳️ శిష్యుడు ఆశ్చర్యపోయి, *'ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి?* అన్నాడు.
✳️ *'మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం.* ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. *భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం.*
✳️ సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు' అంటూ వివరించారు రమణులు.
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
No comments:
Post a Comment