నేటి మంచిమాట
కష్టం మనకు మాత్రమే కనిపించేది దెయ్యం లాంటిది .దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు .అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు.
కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కన్నా ఎక్కువ ఉండదు. అది చేసే నష్టమాత్రం మామూలుగా ఉండదు.
జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరే దిగిపోతుంటే మనకోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసి పోతూ ఉంటుంది.
కోపం కష్టం జీవితం మూడు మనవే. కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడు వినవు. మనకు చెప్పిరావు.
ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే మనల్ని మనమే నమ్మేలా చేస్తుంది.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment