Tuesday, March 21, 2023

****మీ ఆరోగ్యం ఆనందం మీ చేతుల్లోనే ఉంది.

 మీ ఆరోగ్యం ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఈ మెసేజ్ చాలా పెద్దది అయినా ఓర్పుతో చదివిన వారికి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. మనసుపెట్టి చదవండి.

భావోద్వేగాలను అను చుకోవడం ఎలా?
భావోద్వేగాలు అంటే ఏమిటి?
 ఒక సంఘటన(Situation )ఫై మనకు ఉండేటువంటి ఫీలింగ్స్ నే  భావోద్వేగాలు అంటారు.
భావోద్వేగాలు రెండు రకాలుగా ఉంటాది
1.  పాజిటివ్:- ప్రేమ ఆనందం సంతోషం నమ్మకం సానుభూతి, దయ
2.  నెగిటివ్ :- కోపం, చిరాకు, భయం, ఆందోళన, విచారం,దుఃఖం  అసహ్యించుకోవడం.
భావోద్వేగాలు  స్వయం అవగాహన
 స్వయం ప్రేరణ
 స్వయం నిర్వహణ
 స్వయం నియంత్రణ
 స్వయం అవగాహన

Example :- నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే,  మా ఆవిడ  వేడి నీళ్ళు పెట్టింది.  స్నానం చేసి రమ్మంది.. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత.. టి, టిఫిన్ తీసుకొచ్చి పెట్టినారు. ఆ సమయంలో నా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
A.మా ఆవిడ చాలా మంచిది రాగానే వేడి నీళ్ళు పెట్టి, టీ, టిఫిన్ ఇచ్చింది.
B. మా ఆవిడ నేను ఆఫీస్ నుంచి రాగానే బాగా రిసీవ్ చేసుకుంది.  నాకు కావాల్సిన సౌకర్యాలు చేకూర్చింది.
C. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.
D.  ఇలాంటి మంచి భార్య దొరికినందుకు నేను  చాలా అదృష్ట వంతుని..
 ఇదే సంఘటన మరో విధంగా చూద్దాం.
 నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే... మా ఆవిడ కార్తీకదీపం సీరియల్ దీర్ఘంగా చూస్తూ ఉంది..
 నా గురించి పట్టించుకోలేదు... తలనొప్పిగా ఉంది టి తీసుకు రమ్మన్నాను... మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పినది. నేను గదిలోకెళ్ళి వెళ్లి టీ చేసుకుని తాగాను.. తన కు ఒక కప్పునా శ్రీమతి విజయ కు  ఇచ్చాను.  వేడి నీళ్లు నేనే స్టవ్ మీద పాత్ర పెట్టి వే డి చేసుకొని స్నానం చేశాను.
 నేను పాజిటివ్ గా ఆలోచించడం వలన.. అంతా సవ్యంగా జరిగింది  నెగిటివ్ ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుంది.?
 నేను  ఆఫీసు నుంచి రాగానే..  మా ఆవిడ టీవీ సీరియల్స్ చూడడం చూసి.. టీ తీసుకు రమ్మన్నాను... పావుగంట తర్వాత బ్రేక్ వస్తాది.  అప్పుడు చేసి ఇస్తాను.  ఏమిటే నేను  ఆఫీస్ నుంచి నేను కష్టపడి
డ్యూటీ చేసి  ఇంటికి వస్తే..   నీకు,  మంచినీళ్లు టీ ఇవ్వ డానికి   కూడా నేను కూడా తీరిక లేదా... కోపంతో నాలుగు చివాట్లు పెట్టి... టీవీ రిమోట్ తీసుకొని నేలకేసి కొట్టాను. అంతే ఇద్దరమూ నానా తిట్ల పురాణం తిట్టుకుంటూ
 పెద్ద గొడవ జరిగింది...

చూశారా మిత్రులారా... పాజిటివ్ గా ఆలోచించడం వల్ల సమస్య... చాలా సింపుల్ గా.. పరిష్కరించబడుతుంది.. ఇద్దరూ హ్యాపీ గా ఉండవచ్చు.. విషయాలు కూడా నెగిటివ్ గా ఆలోచిస్తే... పెద్ద పెద్ద గొడవలు జరిగి.. విడిపోవడానికి దారితీయవచ్చు.
 
స్వయం ప్రేరణ
 ఒక వ్యక్తి నేరం చేసిన పుడు,  జడ్జి గారు అతనికి శిక్ష వేశారు.  అతని శరీరం నుండి రక్తం తీసి చంపి వేయమని. జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఖైదీ కి శిక్ష వేయడానికి డాక్టర్ గారు వచ్చారు. ఖైదీ దగ్గరకు వచ్చారు.. నీ శరీరం నుండి రక్తం మొత్తం లాగి వేస్తున్నాను.. దానికి మానసికంగానూ సిద్ధమై ఉండు...డాక్టర్ గారు వెంటనే ఒక సిరంజిని అతని శరీరంలో కి ఇంజక్షన్ నీడిల్ లో పంపడం జరిగింది..  మీ శరీరం నుండి రక్తం నేను తీసి వేస్తున్నాను..
డాక్టర్ గారు ఖైదీతో చెబుతూ ఉన్నా రు.  ఖైదీ భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు... తన శరీరం నుండి మొత్తం రక్తం లాగిస్తున్నారు.. నా శరీరంలో ఏమీ మిగలడం లేదు అనుకుంటూ  భయంతో... చనిపోయినాడు.
కానీ నిజంగా అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే..? ఖైదీ కి ఇంజక్షన్ చేయడం జరిగింది.
 కానీ అతని శరీరం నుండి  ఒక్క రక్తపు బొట్టు కూడా తీయలేదు
 కాని  అతడు తన మనసుకు సిగ్నల్స్ పంపాడు.. తన శరీరం నుండి మొత్తం రక్తం తీసి వేస్తున్నారు... నెగటివ్ గా  ఆలోచించి..  తన ప్రాణాలు కోల్పోయాడు.. 

ఇంకో సంఘటన తీసుకుందాం...
మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నారు  అనుకోకుండా ఒక వ్యక్తికి ఆక్సిడెంట్ జరిగింది... కానీ అతని లేపడానికి ఎవరు దగ్గరికి వెళ్లడం లేదు..ఎవరు సహాయం చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు.
 ఎవరూ రావట్లేదని మీరు ఆలోచిస్తున్నారు కానీ... మీరు వెళ్లి ఎందుకు సహాయం చేయడం లేదు.

కృతజ్ఞతా భావం.
 ఉదాహరణ :- నేను రోడ్డు మీద వెళుతూ ఉన్నాను.. నా జేబులో నుంచి పెన్  పడిపోయింది
 దారిన వెళ్తున్న వ్యక్తి.. చూసి.. ఎక్స్క్యూజ్ మీ సర్ మీ పెన్ను పడిపోయింది తీసుకోండి..,!!
వెంటనే థాంక్యూ అనే పదము నా నోటి నుంచి వచ్చింది.  చూడండి మిత్రులారా చిన్న సహాయం చేసిన దీనికి.. ఎదుటి వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతున్నారు..మీ కోసం కష్టపడుతున్న మీ అమ్మ నాన్న లకు  మీరు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా?
 కొందరు అమ్మానాన్నలను నిందిస్తారు... మంచి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని, బైకు, కారు కొనివ్వలేదని.. మీరు  ఓపెన్ ప్లాట్స్,కాని  ఇల్లుగాని  ముందు కొని  ఉంటే.. ఈనాటికి కోట్ల రూపాయలు వచ్చేటివి...  కష్టాలు ఉండేవి కాదు. నీవు ఎందుకు చేతకాని వాడివి...?
 మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి... మీరు పెద్దవారు అయిన తర్వాత.. మీ పిల్లలు మిమ్మల్ని అలా ప్రశ్నిస్తే  వాళ్లకు ఎలా ఉంటది?  కాబట్టి పెద్దవాళ్ళు ను ప్రశ్నించే టప్పుడుజాగ్రత్తగా ఆలోచించి ప్రశ్నించాలి.
మీ లోని భావాలను బయట పెట్టండి..
మీ అమ్మానాన్న పై మీ కు ప్రేమ ఉందా?
 మీ భార్య పై మీకు ప్రేమ ఉందా?
 మీ పిల్లలపై మీకు ప్రేమ ఉందా ?
 మీ అన్నదమ్ములు అక్క చెల్లెల పై ప్రేమ ఉందా..?
మీ బంధువుల పై ప్రేమ ఉందా?
 స్నేహితుల పై ప్రేమ ఉందా?
మీ భార్య వంట చేసినప్పుడు.. మీరు ఎప్పుడైనా మెచ్చుకుంటున్నారా ?
పొరపాటున ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా... తిడుతున్నారు.. ఈరోజు గుత్తి వంకాయ కూర చాలా రుచిగా చేశావు... సూపర్ గా ఉంది... ఇప్పుడైనా మీ ఆవిడని పొగడరా?
మీ అమ్మగారిని పొగడరా?
 ఒక్కసారి ఆలోచించండి...
 రేపటి నుండి మీరు..వారు  చేసిన వంటలు మెచ్చుకోండి..  చాలా సూపర్ గా ఉంది చాలా బాగుంది. నీ చేతి వంట చాలా అమోఘం.. మెచ్చుకోవడం చేయండి.... తర్వాత చూడండి వాళ్లలో కలిగే ప్రతి స్పందనలు... మీకు ఇంకా ఇష్టంగా మంచి వంటలు చేసి పెడతారు...
నెగిటివ్ గా బాగాలేదు అని చెప్పి మీరు రోజూ ఏదో ఒక వంక పెడుతుంటే...
వాళ్ళు నిజంగానే వంట చేయడానికి ఆసక్తి చూపరు.. ప్రేమతో కాకుండా యాంత్రికంగా వండుతారు

స్వయం నిర్వహణ
ఉదాహరణ తీసుకుందాం:-మీరు ఒక రోజు ఆఫీస్ కి లేట్ గా వెళ్లారు అది చూసి మిమ్మలను బాస్ పిలిచాడు ఎందుకండి మీరు ఈ రోజు లేటుగా ఆఫీసుకు వచ్చారు ముందుగా రావడం తెలియదా? చాలాసార్లు మీరులేటుగా వస్తున్నారు.? చాలాసార్లు చూశాను ?
ఈ సంఘటనతో ఎలా రియాక్ట్ అవుతారు.
ఉద్యోగి:-నేను కరెక్టు సమయానికి ఇంటి దగ్గర బయలుదేరి వచ్చాను కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైంది...?
బాస్:--ఇలాంటి కుంటిసాకులు చాలా చెప్తారు. ఉదయం పూట ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటది మీరు ముందుగా బయలుదేరి రావాలి.!
ఉద్యోగి:: ఈ బాస్ అంతే.... పొరపాటున ఎప్పుడైనా ఐదు నిమిషాలు లేట్ వస్తే... అందరి ముందు గట్టిగా చులకనగా మాట్లాడుతున్నాడు... దరిద్రుడు చండశాసనుడు.. హిట్లర్... ఇలాంటి ఆఫీస్ లో చేరడమే నా బుద్ధి తక్కువ.. ఇలాంటి చెత్త బాస్ ఉన్న ఆఫీస్ లో చేయడం నాకు అవసరమా ?
(స్పందించడం) ::
నేను బాస్ ప్లేస్ లో ఉండి ఉంటే... ఆలస్యంగా ఆఫీసుకు వస్తే ఇలాగే స్పందించే వాడిని కదా..! అనవసరంగా బాస్ తిట్టాను... బాస్ యొక్క బాధ్యత అందరినీ కంట్రోల్ చేయడం... పని చేయించుకోవడం.

సిగ్నెట్ ప్రైడ్ -ప్రముఖ సైకాలజిస్ట్ అంటాడు... ప్రతి  వ్యక్తిలోనూ మూడు లక్షణాలు ఉంటాయి..
 సంఘటన బట్టి స్పందిస్తూ.. ఉంటారు.
ఉదాహరణ తీసుకుందాం :--
ఒక వ్యక్తి కదులుతున్న బస్సును పరిగెత్తుతూ వచ్చి ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. ఆ బస్సును అందుకోలేక ఆ వ్యక్తి జారి కింద పడ్డాడు... 
Child :ఆ సంఘటన చూసిన ఒక వ్యక్తి... వెంటనే పక్కున నవ్వాడు... అతనికి నవ్వొచ్చింది.
అతనిలో చైల్డ్ లక్షణాలు కనబడుతున్నాయి.
ADULT: ఇదే సంఘటన చూసి ఈ విధంగా స్పందించవచ్చు... పడిన వ్యక్తిని పైకి లేపి, పక్కన కూర్చోబెట్టి 
గాయాలు ఏమైనా తగిలాయా ?
రక్తం ఏమైనా వచ్చిందా ? మంచినీళ్లు త్రాగడానికి ఇస్తారు.
అప్పుడు అతనిలో ( అడల్ట్) పెద్దవారి లక్షణాలు కనబడతాయి .
Parent:: ఈ సంఘటన.. ఈ విధంగా స్పందించవచ్చు...
బస్సు నుంచి కింద పడ్డ వ్యక్తి ని.. పక్కకు తీసుకెళ్లి.. నీళ్ళిచ్చి తాగించి
తన పేరు ఊరు అడిగి.. అతను ఆ సంఘటన నుంచి.. ఆ షాక్ లో నుంచి బయట పడ్డ తరువాత...
చూడు బాబు నువ్వు రన్నింగ్ బస్సు 
ఎక్కడం తప్పు కాదా ? పొరపాటున వెనుక చక్రం కింద పడి ఉంటే... ఇప్పటికీ నీ ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. నీమీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు... అనాధలు అయ్యేవాళ్ళు.... ఐదు నిమిషాలు లేట్ అవుతే అవుతుంది... తర్వాత బస్సు ఎక్కి వెళ్ళవచ్చు కదా...?
ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది... మంచి మాటలు చెప్పడం జరుగుతుంది.

పై విధంగా ఒకే సంఘటన గురించి ప్రతి వ్యక్తిలోనూ..
సందర్భానుసారంగా..  చిన్నపిల్లవాని మనస్తత్వం బయటపడతాయి... పెద్దవారిగా స్పందిస్తారు.. పేరెంట్ గా స్పందిస్తూ ఉంటారు.

కాంప్లిమెంటరీ డైరీ... చిన్న పాకెట్ బుక్.. ఎప్పుడూ మీ జేబులో పెట్టుకోండి.. ఏదైనా సంఘటన లో ఎవరైనా మిమ్మలను బాగా పొగిడినప్పుడు... వారి దగ్గర complementary డైరీలో  రా పించండి. ఆ బుక్ లో కనీసం ఇరవై కాంప్లిమెంటరీ లు ఉండాలి..
ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వకూడదు
 వాళ్లను అడిగి మీరు తీసుకోవాలి
కాంప్లిమెంట్ డైరీ ఈ విధంగా ఉండాలి:-
1. సీరియల్ నెంబర్
2 తేదీ
3. ఇచ్చిన వ్యక్తి పేరు
4. ఏ సందర్భంలో ఇచ్చారు
5. కాంప్లిమెంటరీ:
ఇలా మీరు డైరీ లో 20 మంది. నుంచి అడిగి తీసుకోండి. దీన్ని ఎలా వాడాలో చూద్దాం..
కాంప్లిమెంటరీ డైరీ ఎక్కడ అప్లై చేయాలో చూద్దాం...

ఒక సారి మీ ఇంట్లో మీభార్య తో పెద్ద గొడవ జరిగింది,  తిట్టుకొని కొట్టు కొనే వరకు వచ్చింది . వెంటనే మీరు వేరే రూమ్ లోకి వెళ్లి. 5 గురుఇచ్చిన కాంప్లిమెంటరీ డైరీలోని వాక్యాలు చదవండి . టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారు. పదిమంది ఇచ్చిన కాంప్లిమెంటరీ చదివితే. ముఖములో. చిరు నవ్వు వస్తాది.
15 మంది ఇచ్చిన కాంప్లిమెంటరీ చదివితే.. డిస్టర్బ్ నుంచి ఎమోషన్ నుంచి బయట పడతారు.. రిలాక్స్ గా ఫీల్ అవుతారు .
ఉదాహరణ కోసం భార్య భర్తల మీద గొడవ చెప్పాను మీ ఆఫీసులో కూడా జరిగితే ఇదే విధంగా చేయండి... జీవితం ఆనందంగా కలపాలంటే కాంప్లిమెంటరీ డైరీ ప్రతి ఒక్కరూ పాటించండి... ఫ్యామిలీతో  మీ ఆఫీస్ వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.

4.SelfControl(స్వయం నియంత్రణ)
ఉద హరణకు ఒక స్టోరీ తీసుకుందాం :.. పాఠశాలలో 6 తరగతి గదిలో.. 100మంది పిల్లలు ఉన్నారు. టీచర్ ఒక్కొక్కరికి ఒక్కో చాక్లెట్ ఇచ్చారు.. పిల్లలు నియమించిన చాక్లెట్ మీరు ఇప్పుడే తినకండి... రేపు ఉదయం మీరు క్లాస్ రూమ్ కు తీసుకువచ్చి నాకు చూపించాలి. రాము అనే బాలుడు ఉపాధ్యాయుని అడిగారు, మాస్టర్ గారు రేపు ఉదయం చాక్లెట్ ఎందుకు తీసుకురావాలి, మాకు మీరు ఎందుకు ఇచ్చినట్లు అని ప్రశ్నించాడు. రాము రేపు ఉదయం వరకు ఆగండి చెబుతాను అన్నాడు అలాగే మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ తరగతి గది లోకి రాగానే... పిల్లలు నేను మీకు ఇచ్చిన చాక్లెట్లు  మీచేతిలో తీసుకుని చేతులు పైకి ఎత్తండి.. అన్నారు మాస్టర్ గారు.. తీసుకొని పిల్లలు చేతులు పైకెత్తారు... మాస్టర్ వెళ్లి దగ్గరికెళ్ళి లెక్కపెడితే..20 మంది పిల్లలు.. దగ్గర మాత్రమే చాక్లెట్స్ ఉంది.. 80 మంది చాక్లెట్ తినేసి వచ్చారు..
Mr. Emotional... రేపటి వరకు చాక్లెట్ తినకుండాఅగ లేక పోయాడు. ఇప్పుడు ఇప్పుడు తిందామని ఆత్రుత మనసులో ఉంది.ఈ చాక్లెట్ తినకుండా రేపు వచ్చి చూపిస్తే మరొక చాక్లెట్లు ఇస్తాడని.. భావించాడు ఓపికతో ఎదురుచూశాడు.
20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.
(గెట్ టుగెదర్) పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు..
 20 సంవత్సరాల క్రితం  చాక్లెట్ ఇచ్చినప్పుడు తినకుండా మరుసటి రోజు తెచ్చిన 20 మంది పిల్లలు... ఉన్న వాళ్ల పొజిషన్ చూస్తే.. వాళ్ళందరూ కూడా పెద్ద హోదా లొ
ఐపీఎస్, ఐఏఎస్, సీఈఓ, మేనేజర్లు,.. పెద్ద హోదాలో వాళ్ళు ఉన్నారు.. ఆ రోజు చాక్లెట్ మాస్టర్ ఇచ్చినప్పుడు, తొందర పడి తినకుండా భవిష్యత్ గురించి ఆలోచించారు . ఈరొజుఎంజాయ్ చేయడం గురించి కాకుండా... భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్లు ఉన్నతస్థాయికి వెళతారు .
వాళ్ళు పెద్ద ఆఫీసర్లు అయినారు.
20 సంవత్సరాల క్రితం ఎవరైతే  కంట్రోల్ చేసుకోలేక.. చాక్లెట్ తినేసిన 80 శాతం మంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు
కొందరు ఏమి పని చేయకుండా అలాగే ఖాళీగా తిరుగుతున్నారు..
 ప్రతి వ్యక్తిలోనూ రెండు మనస్తత్వాలు ఉంటాయి . ఏది మంచిది ఏది చెడు అని ఆలోచిస్తారు . 
 
మనలొవచ్చే భావోద్వేగాలు లో అనచుకోవడానికి. మెడిటేషన్ యోగా చేయడం చాలా లాభం గా ఉంటది... ఎమోషన్స్ ను మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా.. హ్యాపీగా జీవించగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ యోగా మెడిటేషన్ చేయండి
భావోద్వేగాలనుఅదుపులో ఉంచుకోండి.
ఈనాడు ఈ స్పీడు యుగంలో.. చేసినప్పటి నుంచి రాత్రి వరకు మనిషి అనునిత్యం పరిగెడుతూనే ఉన్నాడు.. ఇంటి పనులు ఆఫీసు పనులతో.. బిజీగా గడుపుతున్నాడు. పెద్ద వాళ్ల దగ్గర కాంప్లిమెంటరీ డైరీ వాడకండి
భార్య భర్త ల మీద గొడవ జరిగినప్పుడు కాంప్లిమెంటరీడైరీ
 వాడండి
పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్లతో స్నేహం చేయండి,  తిరగండి,  మాట్లాడండి కాల్ చేయండి.. కొత్తవాళ్లతో స్నేహం చేయండి.. కాంప్లిమెంటరీ డైరీ మీరు తీసుకున్నప్పుడు... ఆడియో రూపంలో కూడా  మీరు తీసుకోవచ్చు... ఇంకా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనసు డిస్ట్రబ్ అయినప్పుడు.. ఆడియో
రూపంలో ఉన్నది వినండి తొందరగా బయటపడతారు

ఉదాహరణకు ;.. ఒక వ్యక్తి తన కారులో వెళుతూ ఉన్నాడు. బైక్ మీద రాంగ్ రూట్ లో వచ్చిన వ్యక్తి వచ్చి.. కారును డ్యామేజ్ చేసి... అగకుండా వెళ్ళిపోయాడు... కారులో ఉన్న వ్యక్తి ఏం చేయాలి.... కార్ మెకానిక్ షెడ్ తీసుకెళ్లి... కారురిపేర్ చేపించాలి... సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు.
1.బైక్ మీద వచ్చిన వ్యక్తి కారు ను గుద్ది వెళ్లినందుకు.. బాధపడ్డాడు
2.Becose of  జరిగిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి.... మెకానిక్ దగ్గరికి వెళ్లి పేరు చేపించుకోవాలి.
3.నాకు చాలా బాధకూడా వచ్చింది దుఃఖం కూడా వచ్చింది.
4. నేను రేపటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా నడపాలి
  2 వఉదాహరణ తీసుకుందాం:-
అమ్మ అక్కయ్య నన్ను కొడుతుంది... బాబు వెళ్లి వాళ్ళ అమ్మకు కంప్లైంట్ ఇచ్చాడు... బాబును అమ్మ అడిగింది..
అక్కయ్య నిన్ను ఎందుకు కొట్టింది ?
చదువుకోవడం లేదుఅని  కొట్టింది ! అక్కయ్య కొట్టిందని  బాబు ఎడ్చనాడు . నేను రేపటి నుంచి బుద్ధిగా చదువుకుంటానని అక్కయ్యకు చెప్పాడు

 భావోద్వేగాలను అదుపులో ఉంచుకో కుండా... కుటుంబములో చాలా గొడవ లుజరిగి . మనశ్శాంతి లేకుండా గడుపుతున్నారు. పార్లమెంట్,అసెంబ్లీలలో సభ్యులు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా గొడవలు జరుగుతున్నాయి... సభ నుండి వాకౌట్ చేస్తున్నారు.. మైక్ లను విర కొడుతున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే బాగుంటది.
అవతల వ్యక్తి ఫోనులో.. మనస్సుకు బాధ కలిగించే మాటలు మాట్లాడితే
భావోద్వేగాలకు గురై... నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలంటే... ఎమోషన్స్ ఫీలింగ్స్ ను నియంత్రణలో ఉంచుకోండి.
బీ హ్యాపీ...

 ఓపికతో ఇదంతా చదివిన మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment