Wednesday, March 22, 2023

:::: నమ్మకాలు -- మనో భావాలు ::::

 *:::: నమ్మకాలు -- మనో భావాలు :::::::::*

      నమ్మకాలు మూఢమైనవి కాకుంటే అవి వాస్తవాలకు ప్రతినిధులు.
    కాని మనం వాస్తవాలకు ప్రతినిధులుగా వున్న విషయాలను నమ్మకాలుగా భావించడం లేదు.
     మనకు మాత్రమే చెందిన మన అభిప్రాయాలను,  ఉద్దేశ్యాలను, మన ఇష్టాలను, తీర్మానాలను, ఇతరుల నుండి పరీక్షించకుండానే స్వీకరించి అంగీకరించిన అవాస్తవాలను, ,అంధవిశ్వాసాలను,మన నిబద్దతలను, వీటినే  నమ్మకాలు అంటున్నాము.
  అందుకే వీటికి విరుద్ధమైన ఇతరుల అభిప్రాయాలనే కాక సత్యాలను కూడా అంగీకరించ లేక , మన మనో భావాలు దెబ్బ తీసుకొని భావోద్వేగాలకు లోనైతున్నాము.

     ధ్యానం మనో భావాలు దెబ్బ తినకుండా, భావోద్వేగాలకు గురికాకుండా మనలను కాపాడుతుంది. ఇతరులను గాయ పరచ నివ్వదు.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment