Tuesday, March 21, 2023

ప్రశ్న: భగవాన్! శరణాగతిలో దైవ - గురు అనుగ్రహ పాత్ర ఎట్టిది?

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

ప్రశ్న: భగవాన్! శరణాగతిలో దైవ - గురు అనుగ్రహ పాత్ర ఎట్టిది?

మహర్షి:

శరణాగతి అందరికి అతి ముఖ్యమైనది. శరణాగతి అంటే ఎదో గురువుకు ఎంతోకొంత ధనం ఇచ్చి నేను శరణుజొచ్చాను అని చెప్పడం కాదు. శరణాగతి అంత తేలికయినదికాదు.

శరణాగతి పొందడానికి ప్రయత్నించిన ప్రతిసారి అహం తలెత్తుతూ ఉంటుంది. అహంకారాన్ని అణచడం అంత సులభతరము కాదు. మొదట అహంకారాన్ని అణచడానికి అన్నివిధాలా ప్రయత్నం చేయాలి.

దైవం(గురువు) తానుగా అనుగ్రహం చూపి మనస్సును లోనికి మళ్ళిస్తే తప్ప శరణాగతి సాధ్యంకాదు.

కానీ శరణాగతి చెందడానికి ముందు పూర్వజన్మలలోనో, ఈ జన్మలోనో మనసు నాశనం కావడానికి అవసరమయ్యే అన్నిరకాల సాధనలూ, శ్రమలూ పడి అహంకారాన్ని అణచడానికి ప్రయత్నం చేసేవారికి మాత్రమే గురువు అనుగ్రహం లభిస్తుంది.

No comments:

Post a Comment