*** అందం***
* అందం నడవడికలో ఉంటుంది కాని, ఆడంబరాలలో కాదు.
-గాంధీజీ
* అందం పిలిస్తే, కీర్తి దారి చూపుతుంది. -నథానియల్ లీ
* అందం లోతు చర్మం వరకే. -ఆంగ్ల సామెత
* అందం ఆధారంగా పెంచుకున్న ప్రేమ అందంతో పాటే అంతరించి పోతుంది. -జాన్ డాన్
* అందం అత్యున్నతమైనది. ప్రకృతి రహస్యానికి అది సంకేతం. రాబర్ట్ బ్రిడ్జెస్
* అందం భగవంతుని దస్తూరి.
-ఎమర్సన్
* అందం కంటిని ఆకట్టుకుంటుంది. సౌశీల్యం హృదయాన్ని దోచుకుంటుంది.
-రామకృష్ణ పరమహంస
* అందం ఆనందాన్ని ఇస్తుంది. అనురాగం అమృతాన్ని కురిపిస్తుంది. మంచి మనసునిన్ను మనుషుల్లో మహాత్ముణ్ణి చేస్తుంది.
-
* ఆకర్షణ శక్తి వుంటే అతనికి మరేమి అవసరం లేదు. అదే లేనప్పుడు ఇతరాలు ఏమి ఉన్నా ప్రయోజనం లేదు.
- జేమ్స్ మాథ్యూ బరి
* అందం చూచే వాని కళ్ళలో ఉంటుంది. -మార్గరెట్ ఉల్ఫ్
* బలప్రయోగం చేయని రాజు వంటిది అందం.-చల్లా రాధాకృష్ణశర్మ
* ఆలోచించే మనసుపైన అందం ఆధారపడి ఉంటుంది.
- డేవిడ్ హ్యూమ్
అందమే అధికారం. నవ్వు దాని ఆయుధం. ప్రపంచంలో అతి సుందరమైనవన్నీ అత్యంత నిష్ప్రయోజనమైనవని ఉదాహరణకు నెమళ్ళు, లిల్లీ పూలు -జాన్ రస్కిన్
* అందమైన ముఖం రికమండేషన్ లెటర్ లాంటిది. -జోసెఫ్ ఎడిసన్
* ప్రతి వస్తువులోనూ ప్రత్యేక సౌందర్యం ఉంటుంది. అయితే అందరూ దానిని చూడలేరు.
-కన్ఫూషియస్
* ఒక చిత్రం వ్యక్త పరచలేనిదే నిజమైన అందం..ఫ్రాన్సిస్ బేకన్
* బాగా అందంగా కనిపించటానికి మనుషులు ప్రయత్నించకూడదు. నిర్లక్ష్య సౌందర్యం ఉత్తమమైంది. -వోవిడ్
* అందము, అందవిహీనము రెండూ కూడా వయసుతో పాటు వచ్చిన ముడతల మాటున కనపడకుండా పోతాయి. ఒకటి పోతుంది, రెండోది దాచి పెట్టబడుతుంది.
* అందమైన వస్తువు నిరంతరం ఆనందం చిందిస్తుంది. దాని మనోహరత్వం దినదినాభివృద్ధి చెందుతుంది. అది ఎన్నటికీ అభావంగా మారదు. అందమైనవేవీ సమృద్ధిగా లభించవు. -ఎమర్సన్
* ప్రతి అందమూ తాత్కాలికమే - క్షణ కాలం కనపడి కనుమరుగయ్యేదే. - లూయిస్ సెర్నుడా
* నలుపు తెలుపులలోన లేదు అందం, తలపు తీరులోనే ఉంది అందం.-చల్లా రాధాకృష్ణశర్మ
* సౌందర్యం స్పష్టంగా కనిపిస్తే ఆనందించాలి. దాక్కుని ఉంటే దాని ముసుగు తీయాలి. శిధిలమై ఉంటే పునరుద్ధరించాలి. అసలు సౌందర్యమే లేకపోతే మనం దానిని సృష్టించాలి. -ఆర్.యం.బ్రౌన్
* అన్ని వస్తువులు శబ్దతః గొప్పగా, మనోహరంగా, ప్రేమ పూర్వకంగా ఉంటాయి. - జాన్ రస్కిన్
* అందమైన బాహ్యరూపం ప్రళయానికి ఒకప్పుడు హేతువవుతుంది. అందమైన అంతరంగం ప్రణయానికి సేతువవుతుంది ఎప్పుడూ..
-చల్లా రాధాకృష్ణశర్మ
తల నెరిస్తే యువతులు మన్మధుడినైనా అసహ్యించుకుంటారు. -MahaBharath
* మంచిగా ఉండటం కన్నా, అందంగా ఉండటం మంచిది. అనాకారిగా ఉండేకన్నా మంచిగా ఉండటం మంచిది. -ఆస్కార్ వైల్డ్
* వయస్సు, ప్రమాదాలు శారీరక సౌందర్యాన్ని హరిస్తాయి కాని, ఆత్మసౌందర్యాన్ని అవేమీ చేయలేవు. -బార్బడోస్ అడ్వకేట్
No comments:
Post a Comment