*_💐ఇవేమి చదువుల్రా బాబోయ్!!!?_* 🤔💐
_(--బూరెల శరత్ బాబు.. మధిర)_
*==(•)==(•)==(•)==(•)==(•)==*
*స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు. హోమ్ వర్క్ అంటే ఇంటి పని. నిజానికది ఇంటిపని కాదు. చదువుకు సంబంధించింది... స్కూల్ పని.*
*పిల్లలు ఇంటికొచ్చాక చదవాలి. రాయడం ప్రాక్టీస్ చేయాలి. నిజమే కానీ...*
*_1. యూకేజీ పిల్లాడు.._*
*కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయ మన్నారు. ఇదే హోమ్ వర్క్. మాంగో అనే పదం. MANGO 🥭 అని ఒక్కో సారి... మొత్తం పది సార్లు పదం రాయాలి. కానీ ఆ పిల్లాడు... M , M, M... అంటూ కిందకు కిందకు పది సార్లు రాశాడు. తరువాత A , A, A... అని M పక్కనే పది సార్లు రాశాడు. ఇలాగే మొత్తం MANGO అనే పదాన్ని రాశాడు. అలాగే మొత్తం పదాలు రాసాడు. హోమ్ వర్క్ పూర్తయ్యింది. ఇప్పుడు ఆ పిల్లాడు నేర్చుకొన్నదేంటి ? ఏమీ లేదు. జస్ట్ మెకానికల్ గా రాసేశాడు.*
*స్పెల్లింగ్ రాదు. రాయడం ప్రాక్టీస్ కాదు. ఎలాగోలా హోమ్ వర్క్ తంతు.. పూర్తయ్యింది. అయితే ప్రయోజనం సున్నా.. 0.*
*2. రెండో క్లాస్ అమ్మాయి... రాత్రి హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి. కానీ త్వరగా నిద్ర పోయింది. పొద్దునే స్కూల్ వాన్ టైం అవుతోంది. హోమ్ వర్క్ పూర్తి కాలేదు .. "స్కూల్ కు వెళితే టీచర్ కొడుతుంది. నేను వెళ్ళను" అని ఏడుస్తోంది... మమ్మీ హోమ్ వర్క్ నోట్ బుక్ తీసుకొని తన కూతురి హ్యాండ్ రైటింగ్ ని అనుకరిస్తూ హోమ్ వర్క్ పూర్తి చేసింది. పాప హ్యాపీగా స్కూల్ కు వెళ్ళింది. టీచర్ "గుడ్" అంది.*
*అమ్మ హ్యాపీ... టీచర్ హ్యాపీ... అమ్మాయీ హ్యాపీ.... కానీ నష్టం జరిగింది ఎవరికి ? ఎందుకీ హోమ్ వర్క్ తంతు?*
*_💐3 . ఏడో క్లాస్ అబ్బాయి .... తెలుగు-ఇంగ్లీష్-హిందీ సబ్జెక్టులు... ఎలా నేర్చుకోవాలి?_*
*అసలు కేవలం తెలుగు పాఠాలు, ఆంగ్ల పాఠాలు, హిందీ పాఠాలు... బట్టీకొట్టి నేర్చుకోవడం దేనికి ? తెలుగు-ఆంగ్లం-హిందీ లాంటి భాషలు విని అర్థం చేసుకోవడం మాట్లాడడం... చదవడం రాయడం. ఇవి కదా నేర్పాల్సింది?!!!!*
*_🌹హోంవర్క్ గా ఇచ్చిన ప్రాజెక్టు వర్క్ ఎలా చెయ్యాలి?_*
*"పర్యావరణం" అనే పాఠం. పది అడవి జంతువుల ఫోటోలు, పది పెంపుడు జంతువుల ఫోటోలు నోట్ బుక్ లో అతికించాలి. అదీ హోమ్ వర్క్. సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ హోమ్ వర్క్ చేయకుండా నిద్ర పోయాడు. డాడీ ఆఫీస్ నుంచి వచ్చాడు. ఈరోజు హోమ్ వర్క్ ఏమిచ్చారో అని చూసిన మమ్మీ పక్కన ఉన్న బుక్ స్టాల్ కు వెళ్లి జంతువుల ఫోటోలు ఉన్న పోస్టర్ కొనుక్కొని వచ్చింది. డాడీ దాన్ని కట్ చేసాడు. మమ్మీ హోమ్ వర్క్ బుక్కు లో అతికించింది. ఆ బొమ్మలు అలా అతికిస్తే ఏమి వస్తుంది ? ఏడో క్లాస్ పిల్లాడికి పులి, సింహం అడవి జంతువులు. ఆవు, మేక పెంపుడు జంతువులు అని తెలియవా? అయితే గియితే ఇది సైన్స్ పాఠం కావాలి. తెలుగులో సబ్జెక్టులో, ఈ పాఠంలో నెరపాల్సింది... {ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో } వైల్డ్ అనిమల్ అంటే అడవి జంతువు.. carnivore అంటే మాంసాహారి.. బయో డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము.. ఇలాంటి విషయాలు కదా? ఆ పోస్టర్ ఏంటి ? దాన్ని అమ్మ నాన్న కలిసి బుక్కు లో అతికిస్తే వచ్చేదేంటి ?*
*ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ?*
*_ఇలాంటి హోమ్ వర్క్ ఇవ్వరేంటి ?_*
*1. జరిగిన పాఠాన్ని రెండు సార్లు చదవండి.*
*2. రేపు జరగబొయ్యే పాఠాన్ని చదివి అర్థం చేసుకొని టీచర్ లాగా బోధించడానికి ప్రయత్నించండి. {రేపటి క్లాసులో}*
*3. ప్రతి రోజూ... ఆ ఆరోజు మీరు చేసినదాన్ని దిన చర్య (డైరీ )గా రాయండి. దీని వల్ల రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. అంతకు మించి చక్కటి మెమొరీ అవుతుంది. "నేను తొమ్మిదో క్లాస్ లో ఉన్నపుడు ఇదిగో ఇలా..." అని రేపు మీ కూతురికో కొడుకుకో చూపించ వచ్చు అని పిల్లలకు చెప్పరెందుకు ?*
*3 . మీరు చదువు తున్న క్లాస్ కంటే రెండు మూడు క్లాస్ లు కింద చదువు తున్న మీ పక్కింటి, పై ఇంటి పిల్లలకు ముఖ్యంగా మీ ఇంటిలో పని చేసే ఆయమ్మ పిల్లలు డ్రైవర్ పిల్లలు ఇలాంటి వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పండి. ఒక పాఠాన్ని బోధించడ మంటే ఆ పాఠాన్ని పది సార్లు చదివి నట్టు లెక్క. ఆ కాన్సెప్ట్ బాగా అర్థం అయి పోతుంది. సమాజసేవగా ఉంటుంది అని చెప్పరెందుకు ?*
*_💐ఇంటి పనికి మరో కోణం 💐_*
*గుండీ ఊడి పోయింది. దాన్ని ఎలా కుట్టాలి ? షూ పాలిష్ ఎలా చెయ్యాలి ? బట్టలు ఎలా ఉతకాలి ? ఉతికిన బట్టలు ఎలా ఆరెయ్యాలి? ఎలా ఐరన్ చెయ్యాలి ? వంట పాత్రలు ఎలా తోమాలి? ఎలా కడగాలి? వంటలు ఎలా చెయ్యాలి ? ఇల్లు ఎలా శుభ్రం చెయ్యాలి ? ఫ్రిజ్ వాడకం అవసరమే . కానీ అతిగా ఫ్రిజ్ వాడితే నష్టం ఏంటి ? మైక్రో వేవ్ ఒవేన్ తో ఆరోగ్యానికి జరిగే నష్టం ఏంటి ?*
*తల్లి సోదరుడు మామయ్య... తండ్రి సోదరుడు బాబాయ్ లేదా పెద్ద నాన్న. ఇద్దరినీ అంకుల్ అని పిలవడ మేంటి ? పక్కింటి పై ఇంటి వారిని అంకుల్... ఆటో అంకుల్ డ్రైవర్ అంకుల్... స్విగ్గీ అంకుల్... ఇదేంటి ? ఇదేమి ఆచారం ? ఇంటికి వచ్చిన బంధువులకు కుటుంబ మిత్రులకు ఎలా గ్రీట్ చెయ్యాలి ? ఎలా మర్యాదలు చెయ్యాలి ? అసలు మర్యాద చేయడమంటే వారికీ స్వీట్ లు, హాట్ లు పెట్టి... ఆల్రెడీ ఊబకాయంతో, షుగర్ తో, బి.పి. తో బాధ పడుతున్న వారిని మొగమాట పెట్టి అతిగా తినిపించి ఆరోగ్యాన్ని మరో అడుగు వెనక్కి, అంటే చెడగొట్టే దశలోకి తీసుకొని పోవడమేనా?!!! పిజ్జాలు, బర్గర్ లు, .. 'కాఫీ' లు, 'టీ' లు .. లడ్లు జాంగ్రీలూ..... ఇవేనా అతిథి మర్యాద వంటకాలు.....?*
*మజ్జిగ, కొబ్బరి నీరు కొబ్బరి ముక్కలు- బెల్లం ముక్కలు, వేరు శనగ గింజలు, మురుకులు, మినప సున్నుండలు, వాటితో పాటు ఖర్జూరం.. ఇలా ఆరోగ్య కరమైన స్నాక్స్ ఎందుకు ఇవ్వ కూడదు. వీటిని ఎలా తయారు చెయ్యాలి... ఇలాంటి వాటిని పిలల్లకు నేర్పేది ఎవరు ?*
*పిల్లలు ఇంటికి రావడం తోటే... _"రేయ్! హోమ్ వర్క్ చెయ్యి... హోమ్ వర్క్ చెయ్యి"_ అని తల్లి వెంట పడడం .. వాడేమో _ఎం - ఎం - ఎం_ అని మాంగో పదం రాయడం హోమ్ వర్క్ అయ్యాక.. బోర్ కొడుతుంది.. టీవీ ముందు కూర్చోవడం లేదా సెల్ ఫోన్ తో ఆటలు. ఇదీ నేటి సీన్.*
*ఇవి చదువులా!!! కావు. _చట్టు బండలు._ పోనీ ఇంటి పని అయినా వచ్చా... అంటే అదీ రాదు...*
*_💐బతకడం నేర్పలేని చదువులెందుకు...? 💐_*
*'ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా' అని తల్లి చెబితే గుర్రున చూసే పదో తరగతి కూతురు...! బంధువులు వస్తే పట్టించుకోని పిల్లలు... 'వంట వార్పూ .. ఇంటి పని తోట పని.. పిల్లలు చేయడ మేంటి ? మా ఇంట్లో పని మనుషులు లేరా' అనుకొనే తల్లి తండ్రులు...*
*ఇంటిపనిలో భాగంగా.... కుట్లు - అల్లికలు, వంటావార్పూ, హౌస్ కీపింగ్, అతిథి మర్యాదలు, డబ్బు- దాని విలువ, పొదుపు, ఆదాయం- ఖర్చులు, సమాజం- బాధ్యత... ఇవన్నీ ఒక్కో క్లాసుల్లో పిల్లల వయస్సును బట్టి నేర్పితే ?.. దీన్నే హోమ్ వర్క్ గా ఇస్తే?.. ఇంటి కెళ్లి ఇవన్నీ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చెయ్యండి. మీ పని తీరు బట్టి మీకు మార్కులు ఇచ్చేది మీ అమ్మ నాన్న అని పాఠశాల చెబితే... తల్లి తండ్రుల్ని కూడా హోమ్ గురువులుగా మారిస్తే.....?*
*1. పిల్లలు బోర్ అనే మాట మరిచి పోతారు. సెల్ ఫోన్ కు, టీవీ కి బానిసలు కారు.*
*2. తల్లి తండ్రులు- పిల్లల మధ్య సంబంధం మరింత బల పడుతుంది. అమ్మా నాన్నల కష్టాన్ని పిల్లలు సరిగా అర్థంచేసు కొంటారు. బాధ్యత ఎరిగి పెరుగుతారు. మానసిక పరిణతి వస్తుంది.*
*3. పిల్లల్లో ఊబ కాయం రాదు. శారీరక ఆరోగ్యం దృఢ పడుతుంది.*
*4. సేవా భావం, సామజిక బాధ్యత, శ్రమ పట్ల, శ్రమ జీవుల పట్ల గౌరవం, సానుభూతి (Sympathy), సహాను భూతి(Empathy)... మొదలయిన నాయకత్వ లక్షణాలు పిల్లల్లో ఏర్పడతాయి. అలా వారి బంగారు భవితకు బలమైన పునాది పడుతుంది.*
*హోమ్ వర్క్ యొక్క అసలైన ఉద్దేశం, అర్థం, పరమార్థం అందరికీ తెలియాలి. అప్పుడు దాని నిర్వచనం మారాలి.*
*ఏదో మొక్కుబడి తంతుగా హోమ్ వర్క్ ఇవ్వడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ.*
*_హోమ్ వర్క్ అంటే.. పాఠశాలలో నేర్చుకొన్న దానికి కొనసాగింపుగా మరియు పునశ్చరణ చేసుకొనే విధంగా ఇంటివద్ద కొంచెం సేపు మాత్రమే.. అదికూడా ఇష్టంగా చేయగలిగిన పని._*
*దీన్ని శాస్త్రీయంగా పాఠశాలల్లో టీచర్లు బోధించాలి. ఇంట్లో ప్రాక్టికల్స్ పిల్లలే స్వయంగా... ఆనందంగా చేయాలి. ఆ ప్రాక్టికల్స్ పిల్లలు చేయడం చూసి మార్కులు ఇవ్వాల్సింది అమ్మ నాన్నలే...*
*ఇదండీ రావాల్సిన మార్పు.*
*చదువంటే ఏంటి??!!.......*
*చదువంటే.... మార్కులు, ర్యాంకులు కాదు.*
*బట్టీ చదువుల వల్ల ప్రయోజనం సున్నా.*
*_"చదువంటే బతకడం నేర్పేది. చదువంటే రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసేది."_*
_(--బూరెల శరత్ బాబు.. మధిర)_
*~~~~~~~~~~~~~~~~~~*
*_{💐గౌరవనీయులైన అధికారులకూ, వివిధ పాఠశాలల యాజమాన్యాలకూ, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకూ, తల్లిదండ్రులకూ..... చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరంతా ముందుకు రండి. ఈ విషయాన్ని ఒకటికి పది సార్లు బాగా లోతుగా ఆలోచించండి. బిడ్డలంతా చదువుల సంతలో బలిపశువులై విలువైన తమ బాల్యాన్ని కోల్పోకుండా చూడండి. మంచి చదువంటే ఎలా ఉండాలో మీకు తెలుసు. ఒకసారి ఆలోచించండి. మంచి మార్పును ఆహ్వానించండి!...ధన్యవాదాలతో... --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు. 🙏🙏🙏}_*
No comments:
Post a Comment