*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *చెప్పుడు మాటలు*
💖*వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు.*
❤️ *తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.*
💞 *తల్లిగర్భంలో చనిపోబోయే బిందుసారుడిని చాణక్యుడు తన ఉపాయంతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.*
💓 *చెప్పుడు మాటలు విని కురుసామ్రాజ్యం మీద పగ పెంచుకున్నాడు శకుడు. అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్టుడు పాండవులపై యుద్ధంచేసి సర్వం కోల్పోయారు కౌరవులు.*
💖 *చెప్పుడు మాటలు విని రావణబ్రహ్మ అంతటి మహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడయ్యాడు.*
💓 *చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయినవారు కొందరు, చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు, చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు కొందరు కాస్త పరికించి చూస్తే మన చుట్టూ చాలామంది కనిపిస్తారు.*
💞 *చెప్పుడు మాటలు విని ప్రఖ్యాత రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ని కత్తులతో పోడిచిచంపారు అతని స్నేహితులు & సెనేట్ సభ్యులు. ఆ తర్వాత పశ్చాత్తాపపడి అదే కత్తితో పోడుచుకొని చచ్చిపోయారు.*
💓 *చెప్పుడు మాటలు విని దేశంలో కరోనా టెస్టులు తక్కువ చేస్తూ ప్రజల మరణానికి కారణం అయ్యారు కరోనా టైమ్ లో కొందరు రాజకీయనాయకులు.*
💖 *శకుని చెప్పుడు మాటలు వినటంవలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది కదా…మనమెంత..?*
💓*కనుక చెప్పుడు మాటలవల్ల కలిగే చేటును ప్రతీక్షణం గుర్తు పెట్టుకుని బహు జాగరూకతతో ఉండాలి మనమందరమూ.*
💖 *తస్మాత్ జాగ్రత్త*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment