*డయాబెటిస్ ఒక భ్రమ ...*
ఈ రోజు ప్రపంచ డయాబెటిక్ దినం అని హడావుడి జరుగుతోంది. నిజానికి డయాబెటిస్ మహా సమాధి నిర్మాణం తెలుగువారి చేతుల్లో 7 సంవత్సరాల క్రితమే మొదలయ్యింది.
ఈ శతాబ్దంలో మానవజాతి పట్ల జరిగిన అతి పెద్ద మోసం, ద్రోహం డయాబెటిస్ టైప్ 2 కు ఆధునిక వైద్య సమాజం చేస్తున్న ట్రీట్మెంట్.. వంద మంది కలిసి ఒక మేకను కుక్క అని దుర్బుద్దితో పిలిచి చేసిన మోసపు కధకు ఎంత మాత్రం తగ్గదు ఈ మోసం. నిజానికి సమాజంలో దేముళ్ళ తర్వాత అంత గౌరవం అందుకొంటున్న వైద్యులు ఇందులో నిమిత్తమాత్రులు ఒక రకంగా.. వారి చేత గైడ్లైన్స్ పేరుతో ఇలా చేయిస్తున్నది లక్షల కోట్ల అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ విదేశీ మందుల కంపెనీల దొంగల గాంగ్.
నిజానికి డయాబెటిస్ అంటే శరీరంలో ఉండే ప్రతి అవయవంలో గ్లూకోజ్ (షుగర్) అధికంగా నిల్వ ఉండటం. కానీ వైద్యంలో చేసేది కేవలం రక్తం లో మాత్రమే షుగర్ ను మాయం చేయడం. డయాబెటిస్ కు టాబ్లెట్, ఇన్సులిన్ ద్వారా కేవలం రక్తం నుంచి మాత్రమే షుగర్ మాయం అవుతుంది తప్ప శరీరం నుంచి కాదు. మందులతో షుగర్ అదుపులో ఉన్నట్లు చెప్పటం పెద్ద మోసం. అందుకే డయాబెటిస్ బాధితుల్లో అనేకమంది మందులతో ఎల్లప్పుడూ బ్లడ్ షుగర్ పూర్తి అదుపులో ఉన్నా సరే కళ్ళు, కాళ్ళు, కిడ్నీలు పోగొట్టుకొంటున్నారు.
*డయాబెటిస్ లో టైప్..*
1 మరియు టైప్
2 పూర్తిగా భిన్నమైనవి.
టైప్ 1 అంటే పాంక్రియాసిస్ లో బీటా సెల్స్ నాశనం అవ్వటంతో ఇన్సులిన్ ఉత్పత్తి సున్నా అవ్వటం. టైప్ 2 అంటే బీటాసెల్స్ బాగున్నప్పటికీ శరీరంలో షుగరు నిల్వలు, తద్వారా ఇన్సులిన్ కూడా ఎక్కువగా ఉండటం. ఇన్సులిన్ సున్నా అవ్వటం ఒక జబ్బు, ఇన్సులిన్ ఎక్కువ అవ్వటం దానికి భిన్నమైన మరొక జబ్బు. మరి రెండిటికీ ఒకే రకం ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ప్రజల చెవుల్లో ఏ రకంగా పూలు పెట్టబడ్డాయో అర్దం చేసుకోవచ్చు. అందుకే అమెరికా నుండి అనకాపల్లి వరకు ఆధునిక వైద్యంలో ఒక్కడిని కూడా మందుల ప్రపంచానికి దూరం చేయలేకపోయారు.
మన శరీరంలో రెండు మెటబాలిజంలు ఉన్నాయి. గ్లూకోజ్ మరియు ఫాట్. గ్లూకోజ్ మెటబాలిజం ను దుర్వినియోగం చేయటం ద్వారా వచ్చిన టైప్ 2 సమస్య ను అదే మెటబాలిజంలో ఉంటూ నయం చేయటం అసాధ్యం. కాబట్టి తాత్కాలికంగా ఫాట్ మెటబాలిజంకు మారినప్పుడు మాత్రమే డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉంటుంది. (అదుపు అంటే బ్లడ్ షుగర్ అదుపు కాదు. HBA1c, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదుపు.)
ఒక సారి డైట్ తో అదుపులోకి వచ్చాక ఒక క్రమ పద్దతిలో ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. ఎప్పటికీ ఆ ఫలితం నిలిచిపోతుంది. ఒకవేళ పోస్ట్ డైట్ సరిగా పాటించలేదు మరల డయాబెటిస్ తిరిగి వచ్చినప్పటికీ, మరోసారి మనం డైట్ చేయటం ద్వారా రివర్స్ చేసుకోవాలి తప్ప పొరపాటున కూడా మందుల మాయాజాలంలో పడకూడదు.
No comments:
Post a Comment