కర్తవ్యం.. -- కర్తవ్యం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనం చేయాల్సిన పనుల సమాహారమే మన కర్తవ్యం. ఒక పని చేయక తప్పదు అన్నప్పుడు కష్టంతో కాదు ఇష్టంతో చేయాలి. అప్పుడే బలంగా నెరవేరేలా చేయగలం. అదే సంకల్పబలం. చాలామంది ఏదో చేశాంలే అనే ఫీల్ తో చేస్తారు. తమ కుటుంబం నిమిత్తం చెయ్యాలికదా అని చేసేవాళ్ళు కొందరుంటారు. తాము చేసేపనుల వల్ల ఇతరులకు మేలు జరగాలని కోరుకుంటూ చేస్తారు మరికొందరు. అందరికీ మంచి జరగాలని సమాజం బాగుండాలని అందరి శ్రేయస్సుకోరే పనులు చేసినవారు మహానుభావులు. ఈ మూడవ నాలుగవ వర్గం వారు ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.. కారణం వారు చేసేవాటిలో సంతృప్తి పొందుతారు. మహానుభావులు అందరి హితం కోరి ముందుకెళ్తుంటారు. మనవల్ల మన పనుల వలన ఏ ఒక్కరికి మేలు జరిగినా మనం జీవితం సార్ధకమైనట్లే. భగవంతుడు చెప్పేది కూడా ఇదే. మన పనులు కర్తవ్యం గొప్పకోసమో మెప్పుకోసమో కాకుండా అందరికీ మంచి చేసే విధంగా ఉండాలి.. శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలి.. మన తరువాత కూడా మనల్ని మరువకూడదు. మనం ఎంతోమంది మహనీయుల్ని వారు గతించి ఏళ్ళు దశాబ్దాలు గడిచినా ఈనాటికీ గుర్తు చేసుకుంటున్నామంటే వారు మనకందించిన సంపదే కదా మాటల చేతల రూపంలో. పదిమందికి మార్గదర్శకంగా ఉండాలన్న ఆలోచనతో మనం ముందుకు వెడదాం మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ.. ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment