Wednesday, November 22, 2023

తల్లిదండ్రుల పాపాలు, పుణ్యాలు, కష్టాలు, రోగాలు పిల్లలకి వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

 ఒకరి ప్రశ్న.

తల్లిదండ్రుల పాపాలు, పుణ్యాలు, కష్టాలు, రోగాలు పిల్లలకి వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

మామిడి చెట్టుకి మామిడి కాయలు, వేపచెట్టు కి వేపకాయలు కాయడం ఎంత సాధారణంగా జరుగుతుందో అదే విధంగా తల్లిదండ్రులు ఎలాంటి వారైతే అలాంటి వారే పిల్లలుగా జన్మిస్తారు. తండ్రి లోని కణం, తల్లి మాంసం వీటితోనే పిండం తయారై బయటికి వస్తుంది. అప్పుడు వీరికి సంబందినవే పిల్లలకు వస్తాయి. దానినే మనం పరిభాషలో జీన్స్ అని పిలుస్తున్నాం.

ఐతే ఇక్కడ రెండు విధాలుగా మార్పులు జరిగే అవకాశం ఉంది. పిల్లలకి చిన్ననాటి నుండి యోగ ధ్యానం వంటివి చేయిస్తూ ఉంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువ, యోగ ధ్యానం వల్ల మనసు విస్తరిస్తుంది. దీనివల్ల మంచి చెడు ఆలోచించే విచక్షణా జ్ఞానం పెరిగి, తల్లిదండ్రులు దింగలైనా, అహంకారం కలిగిన వారైనా వీరి ప్రభావం పిల్లల మీద పడదు. జీన్స్ లో మార్పు జరుగుతుంది.

తల్లిదండ్రులిద్దరూ చాలా మంచి వారైనా గారాబం చేస్తూ, అడిగినవన్నీ అందిస్తూ, నొప్పి తెలియకుండా పెంచితే పిల్లలు చెడిపోయే అవకాశమే ఎక్కువ. అంతేకాకుండా తల్లిదండ్రులలో ఉన్న లోపాలు రోగాలు, చిన్న వయస్సులోనే పిల్లల్లో చెలరేగి కళ్లజోళ్లు, బిపి, బుద్ది మాంద్యం వంటి అనేక రుగ్మతలు, రోగాలకు కారణం అవుతుంది. చుట్టూ సమాజం లో ఉన్న చెడు కి ప్రభావితమై చెడిపోతారు. స్నేహ దోషాల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా జీన్స్ మారిపోతుంది.

అత్మవై పుత్ర నమాసి అని వేద వాక్కు. అంటే తల్లిదండ్రులే పిల్లలుగా మరొక జన్మ పొందుతారు అని. ఒక మామిడి చెట్టు నుండి ఒక టెంక తీసుకొని నాటితే దాని నుండి వేల కాయలు వస్తాయి. వాటిని నాటితే లక్షల కోట్ల కాయలు వస్తాయి. ఎన్ని వచ్చినా అవన్నీ మొదటి చెట్టు నుండే, ఆ ఒక్క టెంక నుండే వచ్చాయి. అన్ని మామిడి పళ్లే. వాటి గుణంలో మార్పు ఉండదు. అలానే మనుషులైన, జంతువులైనా, వృక్ష జాతులైనా.. సృష్టి నియమం ఇది.

మేము చెడ్డ వాళ్ళం పిల్లలైనా బాగుండాలి అనుకోవడం మంచిదే. కానీ మీరు సంపాదించే ధనంతో, మీ ఆలోచనలో పెరుగుతున్న విషయం మర్చిపోకూడదు. మీరు ఎంత చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు అంత చక్కగా పెరుగుతారు. 

పరస్త్రీ వ్యామోహం కారణంగా రావణుడు, అతని సొమ్ము తిని భజన చేసిన కారణంగా పరివారం మొత్తం నాశనం అయ్యారు. దుర్యోధనుడి దుష్ట బుద్ది తెలిసి కూడా మర్చక పోగా మద్దతు తెలిపిన కర్ణుడు, సొమ్ము తిన్నాను వారి పోషణలో ఉన్నాను అనుకున్న కారణంగా భీష్ముడు, ద్రోణుడు వంటి వారు, అతనికి మద్దతు ఇచ్చిన కారణంగా కొన్ని దేశాలు గల్లంతు అయ్యాయి. సొమ్ము ఎలా సంపాదించి పోషిస్తున్నము అనేది చాలా ముఖ్యం. అడ్డదారిలో వస్తుంది కదా అని తెగ సంపాదిస్తే దాని ఫలితం ఆ సంపదలో ఒక్కరూపాయి తిన్న వారిని వదిలిపెట్టదు.

జాగ్రత్తగా ఉండాలి. మంచిగా బ్రతకాలి, మంచి పనులు చేయాలి. మంచి చెప్పాలి. మంచి నేర్పాలి. మంచి ఆచరించాలి. వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటే సృష్టి చూస్తూ ఊరుకోదు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. దాని నియమాలు అనుసరించి బ్రతకాలి. 

శ్రీ...✍️

No comments:

Post a Comment