*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *కర్మ సూత్రం విషయంలో బౌధ్ధులూ, జైనులూ మరికొన్ని మతాలవాళ్లూ ఏకాభిప్రాయానికి వస్తున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తున్నారు. మన ధర్మ శాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు కనబడుతున్నాయి. మనలో ప్రతి ఒక్కరి స్థితీ అనంతమైన పూర్వ జన్మల ఫలితార్ధమే*
💖 *ఈ లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి. అతడు ప్రకృతి లోంచి తళుక్కుమని తటాలున వూడిపడటం లేదు. బిడ్డ నెత్తి మీద అనంతమైన పూర్వ కర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వకర్మలను పరిష్కరించుకునే నిమిత్తమే అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మ సూత్రం.* ❤️ *ప్రతీ ఒక్కడూ తానే కర్త ఔతున్నాడు తన అదృష్టానికి. ఈ సూత్రం ‘విధి వ్రాత‘, ‘దైవ సంకల్పం‘ అనే వాదాలను ఎగురగోట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది.*
💞 *మన దుఃఖాలకు మనమే బాధ్యులం. ఇంకెవరూ కారు. కార్యరూప ఫలం మనమే. కారణమూ మనమే. కనుక మనం అందరం స్వతంత్రులం. నేను దుఃఖినైతే, ఆ దుఃఖం నేను తెచ్చి పెట్టుకున్నదే. నేను తలచుకుంటే సుఖవంతుడినిగా మారగలననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మ ఫలమే. కనుక నేను తలపెడితే పవిత్రుణ్ణి కాగలను అనడానికి బుుజువు కూడా అదే. నరుని ఇచ్ఛా శక్తి పరిస్థితులన్నింటికీ అతీతమై వొప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో వున్న బలిష్టం, మహత్తరం, అఖండం అయిన ఇఛ్ఛాస్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతి కూడా జోహారనవలసిందే తల వంచి దాస్యం చేయవలసిందే. కర్మ సూత్రం యొక్క మహిమ ఇది.*
💝💝 *గణేశ జనని అయిన “పరాశక్తి”కి ప్రముఖంగా ఐదు రూపాలూ, ఐదు నామాలు ఉన్నాయి. “దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రి” అని.*
❤️ *ఈ ప్రపంచ నిర్వహణలో గుణాలన్నింటిలోకి ఉత్తమోత్తమమయిన సత్వ గుణాన్ని సూచించేదే 'ప్ర' అనే అక్షరం. రజో గుణాన్ని సూచించేదే 'కృ' అనే అక్షరం.* *తమో గుణాన్ని సూచించేదే 'తి' అనే అక్షరం. మరోవిధంగా చూస్తే 'ప్ర ' అంటే మిక్కిలి గొప్పది అని. ‘కృతి' అంటే సృష్టి అని అర్ధం. “ప్రకృతి” అంటే ‘గొప్ప సృష్టి’ అని అర్ధం. సృష్టిని సూచించే కృతి అనే పదానికి ముందున్నది ‘ప్ర’….! అంటే సృష్టి కంటే ముందున్నది కనుక “ప్రకృతి” అని కూడా ‘మహాదేవి’ కీర్తించబడుతోంది.*
💖 *సృష్టి ప్రారంభించేటప్పుడు ప్రకృతి యోగశక్తితో తననితాను రెండుగా విభజించుకున్నప్పుడు కుడిభాగం పురుషునిగా ఎడమ భాగం ‘ప్రకృతి’గా …అంటే ‘స్త్రీ’ గా ఆకారాన్ని పొందింది.*
💞 *యోగుల దృష్టిలో స్త్రీ పురుష బేధాలుండవు. అంతా బ్రహ్మ స్వరూపమే. పరాశక్తి నిత్యా సత్య బ్రహ్మస్వరూప. ఆత్మ, శక్తి రెండూ ఒకటే. అగ్ని నుండి వేడిని వేరు చేసి చూడలేం. అట్లే ఆత్మనూ, శక్తినీ వేరు చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment