త్రిపురా రహస్యము - 29
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము
18. ఆత్మ స్వరూపము - 2
సామాన్య చైతన్యము, సుషప్తి రెండూ ఒకటి కాదు. సుషుప్తి అనేది ఒక అవస్థ. కాని చైతన్యము ఎల్లప్పుడు ఉంటుంది. దాన్ని గుర్తించటానికి కొన్ని మార్గాలు చెబుతాను విను.
1. నిద్రా, జిగత్తులకు మధ్యనున్న అతిసూక్ష్ము కాలం ;
సామాన్య చైతన్యము అంటే విషయాకారాన్ని పొందనటువంటి జ్ఞానం. నిద్ర అంటే - సుషుప్తి. జాగ్రత్త అంటే - విషయజ్ఞాన పరంపర. జాగ్రదవస్టలో ఇంద్రియాలు అంతఃకరణ నుంచి బయటకు వచ్చి బాహ్యవిషయాలు (గ్రహిస్తాయి. అదే ఇంద్రియాలు స్వప్నావస్థలో మనసులో ప్రవేశించి, మనసుయొక్క రూపాన్నే పొంది, మనసులో దాగిఉన్న సాంసారికానుభవరూపమైన సంస్కారాలతో సంబంధం పెట్టుకుని వాటినే (గ్రహిస్తాయి. అవే స్వప్నాలు. ఇక సుషుప్తిలో మనసు ఇంద్రియాలతో కలిసి, తనకు మూలకారణమైన ప్రకృతిలో లయమవుతుంది. అప్పుడు తమోగుణము మిగిలిన గుణాలను ఆవరిస్తుంది. ఆ స్థితిలో ఆత్మకనపడి, కనపడనట్లుగా ప్రకాశిస్తుంది. మనసు విషయోన్ముఖం కాదు.
అందుకని ఆత్మ విషయాలను (గ్రహించదు. అందుకని అది విషయాకారం పొందదు. అప్పుడు పూర్తిగా పైకి రాని తమోగుణం ఆత్మను ఆవరించలేదు. అందుచేత ఆత్మ నిరాకారంగా ప్రకాశిస్తుంది. దీన్నే 'సామాన్య చైతన్యము” అంటారు. ఇది నిర్వికల్పమైనది.
2. రెండు భిన్న జ్ఞానాల మధ్య నామాన్య చైతన్యము (వ్రకాళిస్తుంది. రెండు భిన్న జ్ఞానాలు అంటే
1. ఘటాకారానికి సంబంధించినది.
2. పటాకారానికి సంబంధించినది.
ఈ రెండు జ్ఞానాలు ఒకదాని తరువాత ఒకటి కలిగినప్పుడు, ఈ రెంటి మధ్యకాలంలో ఉండే నిరాకార జ్ఞానం. అదే సామాన్య చైతన్యం.
3. ద్రష్ట అయిన ఆత్మచైతన్యానికి, దృశ్యమైన విషయ చైతన్యానికి మధ్యకాలం :
కొంతమంది సంవిద్వేషాల మధ్యకాలంలోనిది సామాన్యవైతన్యం అంటారు. సంవిత్తు అంటే దద్రష్ట దైతన్యం. దీన్నే 'దృక్ అంటారు. అహంరూపంలో ఉన్నటువంటి ద్రష్ట, వేద్యము అంటే తెలియబడునది.
నీరు చెరువులో ఉంటే చెరువు ఆకారంలో ఉంటుంది. పొలంలో ఉంటే పొలం ఆకారంలో ఉంటుంది. మరి చెరువులోనుంచి పొలంలోకి ప్రవహించేటప్పుడు ఏ ఆకారమూ ఉండదు. .అలాగే ద్రష్టచైతన్యము (అహం అనేది) శరీరాకారంలో ఉండి, ఇంద్రియాలద్వారా ఆకాశంలో ఉన్న సూర్యుని వద్దకు ప్రసరించి, సూర్యబింబాన్ని వ్యాపించి సూర్యబింబాకారాన్ని పొందుతుంది. అది దృశ్యచైతన్యరూపము. ఈ మధ్య కాలంలో ఉన్న చైతన్యం నిరాకారము. అదే సామాన్య చైతన్యము.
అదే ఆత్మ. నీ యొక్కనిజస్వరూపము. నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా మోవాం ఉండదు. ఆత్మనుగురించి తెలుసుకోకపోవటంవల్లనే ఈ జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తోంది. అద్దంలో కనిపించే పులి నిజమైనది కాదు. అది ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకున్నవాడు దాన్నిచూసి భయపడడు. అలాగే ఈ జగత్తు నిజంకాదు. అంతా మిధ్య అని తెలునుకున్నవాడు దుఃఖాలు పొందదు. ఆత్మను గురించి తెలుసుకోక పోవటం వల్లనే ఈ జగత్తు దుఃఖాలను అనుభవిస్తోంది. ఆత్మకు సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు ఏవీ లేవు. అది దేనినీ గ్రహించదు. దానిని గ్రహించేవాడు కూడా ఎవడూ లేడు. ఇది సర్వానికీ ఆధారం. అన్ని రూపాలలోనూ ఉంటుంది. కాని దీనిలో ఏమీ ఉందవు.
ఆత్మను చూడాలంటే చాలా కాలం ప్రయత్నం చెయ్యనవసరం లేదు. క్షణకాలంపాటు బాహ్యవిషయాలవైపు మనను వెళ్ళకుండా చేసి బాహ్యవిషయాలను మననులోకి రానీయకుండా చేస్తే చాలు. రూపంతోలేని ఆత్మను చూడటం ఎలా ? అని అడగవద్దు. “ఉన్నాను” అనే భావంతోనే సీ ఆత్మను చూడు. బాహ్యవస్తువుల వెపు పరుగులు పెట్టే మనసును నిరోధించు. అంతర్ముఖం చెయ్యి. మనసు నిశ్చలం చెయ్యి. (గ్రుడ్డివాడిలాగా ఉండు. మనోవ్యాపారములు ఏవీ ఉండకూడదు. నేను చూస్తున్నాను అనెదికూడా మనోవ్యాపారమే. అందుకే దాన్ని కూడా నిరోధించు. దర్శనము, అదర్శనము అనేవాటిని వదలివెయ్యి. అప్పుడు ఆ స్థితిలో ఏది మిగులుతుందో ఆదే నీవు. అదే ఆత్మ. దాన్నే సేవించు” అన్నది హేమలేఖ.
ప్రియురాలి ఉపదేశాన్ని విని, ఆత్మదర్శనం చేసుకుని, బావ్యాజగత్తును మరిచిపోయి చాలాకాలం సమాధిస్థితిలో ఉండిపోయాడు. అంటూ తొమ్మిదవ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు.🙏
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
J N RAO 🙏🙏🙏
No comments:
Post a Comment