Saturday, March 23, 2024

స్వేచ్ఛ

 .                  *స్వేచ్ఛ*
.                 ********

     వచ్చిన మన స్వేచ్ఛా స్వాతంత్ర్యం
       నచ్చిన మన ఇచ్ఛా గణతంత్రం
     నేర్పును సుఖముగ బ్రతికే తంత్రం !
     ఎందుకు మనలో ఏదొ కుతంత్రం ?!

      మన యీ పవిత్ర భరతావనిలో
      సత్కీర్తుల దీప్తుల మధువనిలో
       శ్రేయస్కర సంపాదన పనిలో
     అనుభవ సంభవ సరసామనిలో

     మనసు తరించగ ఇట కొనసాగగ
         ఒకరికొకర మాసరగా ఏగగ
      కలసి ఉంటెనే కలదు సుఖమ్మని
     అదే మనకు నిజమైన స్వేచ్ఛయని

     " కష్టేఫలే " అనె నానుడి తలనిడి
  అనుదినమటునిటు వడి వడి అడుగిడి
         ఆకలి కేకల నెఱుగని  పచ్చని
     పగ సెగలెఱుగని మనుగడె స్వేచ్ఛని

    అపుడే ఎపుడూ మన భవితవ్యము 
   చెలిమి కలిమితో ప్రియ సాంగత్యము
  కొనసాగును గద మన జన గుణములు
 చనువుల మనువుల శుభగృహ సీమలు.

   ఇదియే కద మన నిజమగు స్వేచ్ఛ.
   సమాజమున మన ఇంటా రచ్చా
    ‌సంకట రహితముగా నిశ్చింతగ
   నిరాటంకముగ బ్రతుకగ నెంచగ.

         ********************
రచన :---- రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
   రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)

*************************************

No comments:

Post a Comment