శీర్షిక : *అచ్చుల గేయం ( *బాల *గేయం*)
రచన: మిడిదొడ్డి చంద్రశేఖరరావు
*అఆ* అ అంటే అమ్మ
అమ్మతోనే అన్ని
అ అంటే అవని
అవని లేకుంటే ఏమి లేదు
ఆ అంటే ఆనందం
ఆనందమే ఆరోగ్యం
ఆ అంటే ఆకాశం
ఆకాశం స్థాయికి ఎదగాలి
ఆ ఆవేశం మాను
*ఇఈ* ఇ అంటే ఇష్టం
ఇష్టపడి పని చేయ్
నిన్ను నీవే ఇష్టపడు
ఈ అంటే ఈర్ష్య
ఈర్ష్యను ఈడ్చి కొట్టు
ఈశ్వరుని నువ్వు పూజించు
ఈత నేర్చుట మంచిది
*ఉఊ* ఉ అంటే ఉన్నతం
ఉన్నంతలోనె నువ్వు సర్దుకో
ఉబలాటాలు అధికం చేటు
ఊ అంటే ఊహ
ఊహలు మంచిగ ఊహించు
ఊతం ఇచ్చిన వారిని మరవకు గౌరవించు
ఋ* ఋ అంటే ఋతువు
ఋతువులు ఆరని తెలుసుకో
ఋగ్వేదం దేవ వేదం
ఋషులను చూసి నేర్చుకో
ఋణం ముప్పు తెలుసుకో
*ఎఏ* ఎ అంటే ఎదగడం
నీకు నీవే నేర్చుకో
ఎంత ఎత్తుకు ఎదిగిన గతాన్ని మరవకు
ఏ అంటే ఏకాగ్రత
ఎన్నడూ నువ్ కోల్పోకు
ఏ మార్పు మానుకో అది చేటు
*ఐ* ఐ అంటే ఐక్యం
ఐక్యంగా నువ్ మెలుగు
ఐక్యతే మంచిగుణం
ఐకమత్యమే మహాబలం
ఐక్యత కోసం పోరాడు
*ఒఓ* ఒ అంటే ఒంటరి
ఒంటరితనం జయించు
ఒడిదుడుకులు సహజం
ఓ అంటే ఓటమి
ఓటమిలో నువ్ కృంగకు
ఓర్మితో మెలుగు
*ఔ* ఔ అంటే ఔనని
ఔననడం మంచిదే
ఔనని అనకు అన్నిటికీ
కాదనడం కూడా నేర్చుకో
ఔనత్యముతో మెలుగు
*అం* *అః* అం అంటే అందరం
అందరు బాగుండాలి
అందరూ మంచిగా ఉండాలని
కోరుకో
అందుకే మనమందరం
అః అః అంటూ ముందుకు కదులుదాం
అహర్నిశలూ శ్రమించాలీ ఆనందంగా ఉండాలి
యం. చంద్రశేఖర్.
No comments:
Post a Comment